త్వరలోనే విజయవాడ – హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తాము: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నామని సుస్థిర పాలన అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక రీజనల్ రింగ్ రోడ్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందని, హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మర్చాలని అన్నారు . ఈ మార్గంలో రోజుకి 60 వేల వాహనాలు తిరుగుతాయని తెలిపారు.

17 ప్రమాద జోన్లను గుర్తించామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. త్వరగా హైదరాబాద్ – విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని కోరామని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారని ,16 రోడ్లు పెండింగ్ లో ఉన్నాయని నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారని ఆయన తెలిపారు. ఉప్పల్ – ఘాట్ కేసర్ ఫ్లయ్ ఓవర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు నితిన్ గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. రేపు కిషన్ రెడ్డిని కలుస్తానని , వచ్చే మూడేళ్లలో రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ – హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news