రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్..!

-

ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి. రేషన్ కార్డు ద్వారా ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు బెనిఫిట్స్ ని పొందుతారు. అయితే మోదీ సర్కార్ రేషన్ కార్డు కలిగిన వారికి తీపికబురు అందించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది కేంద్రం. తాజాగా కేంద్రం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్ CSC భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ration-cards

దీనితో రేషన్ కార్డు సర్వీసులు కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే దేశవ్యాప్తంగా చూస్తే 3.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇకపై రేషన్ కార్డు సర్వీసులు కూడా పొందొచ్చు. అయితే కేంద్రం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం వలన దాదాపు 23 కోట్ల మందికి పైగా ప్రయోజనం వస్తుంది.

ఈ విషయం డిజిటల్ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలిపింది. అలానే రేషన్ కార్డు వివరాల అప్‌డేట్, ఆధార్ నెంబర్ సీడింగ్, రేషన్ కార్డు డూప్లికెట్ ప్రింట్, రేషన్ లభ్యత, ఇలా ఎన్నో సేవలు అన్నింటినీ ఇకపై కామన్ సర్వీస్ సెంటర్లలో పొందొచ్చు అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news