టెన్త్ పాస్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు గడువు నవంబరు 14తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నవంబరు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. కాగా, ఏపీ సర్కిల్‌లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్‌లో 970 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. ఓసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్‌లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2019.