టిప్స్ అండ్ ట్రిక్స్: శానిటైజర్‌ను ఎప్పుడైనా ఇలా ఉపయోగించారా…?

-

సహజంగా మనం శానిటైజర్‌ను ఏ వైరస్లు రాకుండా ఉండేందుకు ఉపయోగిస్తాము. కానీ కేవలం ఇలా మాత్రమే కాకుండా అనేక వాటికి బదులుగా వాడొచ్చు. అవేంటి అనే విషయానికి వస్తే.. కళ్లద్దాలు క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. దీనిని ఉపయోగిస్తే.. స్పెషల్ లిక్విడ్ కొనాల్సిన పని కూడా ఉండదు. కళ్లద్దాల పై ఉన్న వేలి ముద్రలు, దుమ్ము మరకలని ఇలా హ్యాండ్ శానిటైజర్ ని ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు.

మొటిమల నుంచి వేగవంతమైన ఉపశమనం కలగడానికి కూడా ఇది సహాయ పడుతుంది. శానిటైజర్ ని కనుక మొటిమలు ఉన్న స్పాట్‌లో రుద్దడం ద్వారా వెంటనే రిలీఫ్ వస్తుంది. కానీ పెంపుడు జంతువులకి మాత్రం ఇది ఉపయోగించొద్దు. అంతే కాదు హెడ్ వాషింగ్ కు టైం లేనట్లయితే బ్లో డ్రయింగ్ కు బదులు శానిటైజర్ బెటర్. సింపుల్ గా మీ వేళ్ళకి దీనిని రాసుకుని హెడ్ కి అప్లై చేస్తే చాలు. డ్రై వాషింగ్ అయిపోతుంది. అలానే చేతికి సిల్వర్ పెట్టుకుని హ్యాండ్ శానిటైజర్‌ను సాఫ్ట్ క్లాత్‌పై కొంచెం శానిటైజర్ వేసి క్లీన్ చేయండి మెరుపు ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇలా కూడా దీనిని ఉపయోగించ వచ్చు.

కీ బోర్డుని శుభ్రం చేయాలనుకుంటే కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. సాధారణ లిక్విడ్స్ చాలా ప్రమాదకరం. అయితే శానిటైజర్ తో క్లీన్ చేయొచ్చు. కానీ పవర్ ని తొలగించడం మాత్రం మరచిపోకండి. మేకప్ బ్రష్ లు క్లీనింగ్ చేసుకోవడం లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం శానిటైజర్ ని వీటిపై వేసి బాగా క్లీన్ చేసి ఆరనివ్వండి. చూసారా శానిటైజర్ ని ఎన్ని విధాలుగా ఉపయోగించ వచ్చో..! దీనితో పని కూడా సులభమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version