పోస్ట్‌ ఆఫీస్‌ సేవల కోసం ఈ యాప్‌!

-

పోస్ట్‌ ఆఫీస్‌కు సంబంధించిన సేవలను పొందడానికి ఒక కొత్త యాప్‌ను సృష్టించింది. అదే పోస్ట్‌ఇన్ఫో. ఈ యాప్‌లో ఇండియా పోస్ట్‌ అందించే సర్వీసుల వివరాలు తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇక తరచూ పోస్ట్‌ ఆఫీస్‌కు సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా. మీ సేవల్ని ట్రాక్‌ చేసేందుకు పోస్ట్‌ఇన్ఫో యాప్‌ ఉపయోగపడుతుంది. పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు ఈ యాప్‌ను తయారు చేశారు.

 

ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో ట్రాకింగ్, పోస్ట్‌ ఆఫీస్‌ సెర్చ్, క్యాలిక్యులేటర్, ఇన్సూ్రన్స్‌ ప్రీమియం, ఇంటరెస్ట్‌ క్యాలిక్యులేటర్‌ అందుబాటులో ఉంటాయి. దీనిలో మీకు దగ్గర్లో పోస్ట్‌ ఆఫీస్‌ను కూడా తెలుసుకోవచ్చు. పోస్ట్‌ఇన్ఫో యాప్‌లో మీ ఏరియా పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న పోస్ట్‌ ఆఫీసుల వివరాలు తెలుస్తాయి. ఈ యాప్‌లో స్పీడ్‌ పోస్ట్, రిజిస్టర్డ్‌ లెటర్, ఇన్సూ్యర్డ్‌ లెటర్, వ్యాల్యూ పేయబుల్‌ లెటర్, రిజిస్టర్డ్‌ ప్యాకెట్స్, పీరియాడికల్స్, పార్శిల్, మీ ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సీఓడీ, ఎలక్ట్రానిక్‌ మనీ ఆర్డర్‌ లాంటి సేవల్ని ట్రాక్‌ చేయొచ్చు. ఇందుకోసం రిఫరెన్స్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి లెటర్‌ లేదా పార్శిల్‌ ఎక్కడ ఉందో ఈజీగా ట్రాక్‌ చేయొచ్చు.పార్శిల్‌కు ఎంత ఛార్జీ చెల్లించాలో కూడా ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఆర్డినరీ లెటర్, స్పీడ్‌ పోస్ట్‌ డొమెస్టిక్, రిజిస్టర్డ్‌ లెటర్, ఆర్డినరీ పార్శిల్‌ ఏ పార్శిల్‌ అయినా ఎంత ఛార్జీ చెల్లించాలో తెలుసుకోవచ్చు.

ఇందులో మొత్తం 5 శ్లాబ్స్‌ ఉంటాయి. లోకల్‌ పేరుతో మొదటి శ్లాబ్, 200 కిలోమీటర్ల వరకు రెండో శ్లాబ్, 201 – 1000 కిలోమీటర్ల వరకు మూడో శ్లాబ్, 1001 – 2000 కిలోమీటర్ల వరకు నాలుగో శ్లాబ్, 2000 కిలోమీటర్ల పైన ఐదో శ్లాబ్‌ ఉంటాయి. పోస్ట్‌ ఆఫీసులో లైఫ్‌ ఇన్సూ్యరెన్స్‌ పాలసీ ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్‌ డిపాజిట్, టైమ్‌ , మంత్లీ ఇన్కమ్‌ స్కీమ్, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వివరాలు తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news