మైక్రో కెమేరాలు. యువతులు, మహిళల పట్ల శాపంగా మారాయి. షాపింగ్ మాల్స్, హోటళ్లకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. దుస్తులు మార్చుకోవాలంటే ఏదో ఆందోళన. ఎక్కడ వీడియో చిత్రీకరణ అవుతుందోననే టెన్షన్. ఏ ఆకతాయి తమ పరువును తీస్తారో తెలియని పరిస్థితి. అయితే, అప్రమత్తత ద్వారా ఆకతాయిల ఆట కట్టించవచ్చు. సులువుగా మైక్రో కెమేరాలను గుర్తించవచ్చు. అదేలా ఓసారి చదవండి.
– చీకటిలో మైక్రో కెమేరాలను సులువుగా గుర్తించవచ్చు. అందుకే, షాపింగ్ మాళ్లు, హోటళ్లలో క్లాత్స్ మార్చుకొనే సమయంలో లైట్లను ఆపేయండి. ఎక్కడైనా మైక్రో కెమేరాలు అమర్చి ఉంటే వెలుగుతూ ఆరుతూ ఉంటాయి కాబట్టి సులువుగా గుర్తించవచ్చు.
– మైక్రో కెమేరాలను సులువుగా ఎక్కడపడితే అక్కడ అమర్చవచ్చు. డోర్‌లాక్‌లు, లాక్స్, బీరువాలు, లైట్లు, గోడ గడియారాల్లో మైక్రో కెమేరాల్లో సులువు అమర్చే అవకాశం ఉంది. వాటిని తీక్షణంగా పరీక్షిస్తే సులువుగా గుర్తు పట్టవచ్చు.
– చీకటిలో కూడా ఇన్‌ఫ్రారెడ్ కెమేరాలు పనిచేస్తాయి. వీటిని సీలింగ్, గోడలు, ట్రయల్‌రూంలోని షీట్లపై అమర్చే అవకాశం ఉంటుంది. మచ్చల రూపంలో ఏదైనా కనిపిస్తే స్మార్ట్‌ఫోన్ కెమేరా ద్వారా జూమ్ చేసి వాటిని గుర్తించవచ్చు.