మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు చాలా అవసరం. ప్రభుత్వ పధకాల మొదలు ఎన్నో వాటి కోసం ఆధార్ తప్పనిసరి. అయితే కొంత మంది ఆధార్ కార్డు మీద ఫోటో సరిగ్గా ఉండదు. మీ ఫోటో కూడా సరిగ్గా లేదా..? ఫోటోని మార్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా ఈజీగా ఫోటోని మార్చేసుకోచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఆధార్ కార్డులో ఫొటోను సులభంగా మార్చుకోవచ్చు. మాన్యువల్‌గానే కాకుండా ఆన్‌లైన్‌లోనూ మార్చుకోచ్చు. మరి ఇక ఎలా మార్చచ్చు అనేది చూద్దాం.
ఆధార్ లో ఫోటోని మార్చడం ఎలా
- ఆధార్ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి.
- నెక్స్ట్ మీరు హోమ్‌పేజీలోని మై ఆధార్ మీద క్లిక్ చెయ్యాలి.
- మైఆధార్ సెక్షన్ లాస్ట్ లో డౌన్‌లోడ్స్ సెక్షన్ కనిపిస్తుంది.
- ఎన్రోల్‌మెంట్/అప్‌డేట్ ఫామ్ అన్న ఆప్షన్ ఉంటుంది.
- ఆ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను ఫిల్ చేయాలి.
- పూర్తి వివరాలతో ఫిల్ చేసిన ఆధార్ ఎన్రోల్‌మెంట్/అప్‌డేట్ ఫామ్‌ను ఆధార్ పర్మినెంట్ ఎన్రోల్‌మెంట్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి.
- ఆ తర్వాత మీరు బయోమెట్రిక్ వివరాలను ఇవ్వాలి. చివర్లో రూ.100 ఫీజు చెల్లిస్తే.. ఫొటో అప్‌డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.
- అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను తీసుకోవాలి.
- యూఆర్ఎల్ కూడా మెసేజ్ ద్వారా వస్తుంది.