బ్యాంకు పనులుంటే పూర్తి చేసేసుకోండి.. ఈ రెండు రోజులు బ్యాంకుల సమ్మె..!

-

మనకి ఏదో ఒక బ్యాంక్ పని వుండే ఉంటుంది. అయితే కొన్ని సార్లు కొన్ని అర్జెంటు పనులు కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులు పని చెయ్యకపోతే ఎంతో ఇబ్బంది మనకి కలుగుతుంది. కనుక సెలవులు వంటివి అడ్డు రాకుండా మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలా? లేదంటే ఇంకా ఏమైనా ఇతర పనులు ఉన్నాయా..? అయితే తప్పక మీరు సమ్మె కోసం తెలుసుకోవాలి.

సెంట్రల్ ట్రేడ్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీనితో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేసే అవకాశం వుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్లు ఇందులో పాల్గొనేలా వున్నారు. అందువల్ల బ్యాంక్ బ్రాంచులు పని చెయ్యక పోవచ్చు. కాబట్టి పనులు ఉంటే ముందే చూసుకోండి. ఇక సమ్మె గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

బ్యాంక్ యూనియన్లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సమ్మె బాట పట్టనున్నాయి. దీని కారణంగా ఈ రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాలలో బ్యాంకులు పని చేయక పోవచ్చు. కాబట్టి ఆ రోజులకి ముందే మీరు పనులను ప్లాన్ చేసుకుంటే మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. బ్యాంకులు ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో కూడా పని చెయ్యవు.

ఇవి కూడా ఎప్పుడు వచ్చాయో చూసుకోండి. ఇది ఇలా ఉంటే బ్యాంక్ సెలవులు ఉన్నా కూడా బ్యాంక్ కస్టమర్లకు ఆన్‌లైన్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కనుక ఆన్‌లైన్ సేవలు ఎప్పుడైనా పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి ద్వారా చేసుకునే పనులకి ఎలాంటి అడ్డంకి ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news