దేశంలో ప్రస్తుతం అనేక బ్యాంకులు కస్టమర్లకు ఇంటి వద్దకే సేవలను అందిస్తున్నాయి. బ్యాంక్ అకౌంట్లను కూడా ఇంట్లోనే కూర్చుని ఓపెన్ చేసే వీలును కల్పిస్తున్నాయి. ఇక ఎస్‌బీఐ కూడా కస్టమర్లకు ఈ అవకాశాన్ని అందిస్తోంది. వినియోగదారులు ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఆన్‌లైన్ లోనే నిమిషాల వ్యవధిలో సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. అందుకు గాను కింది పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో ఎన్‌బీఐ అకౌంట్‌ను ఓపెన్ చేయాలనుకునే వారు అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు, ఆధార్ కార్డులలో ఏదైనా ఒక దాన్ని సమర్పించాలి. అలాగే ఐడీ ప్రూఫ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, ఆధార్ కార్డులలో దేన్నయినా ఇవ్వవచ్చు. అలాగే పాన్ కార్డు లేదా ఫాం 16ను అందజేయాలి. పాన్ పొందని వారు ఫాం 16ను అందజేయాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లో ఇలా ఓపెన్ చేయవచ్చు…
* ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్ లైన్‌లో ఓపెన్ చేసే వారు భారత పౌరులు అయి ఉండాలి. వయస్సు 18 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ ఉండాలి.
* మైనర్లు అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.
* ప్రభుత్వం మంజూరు చేసిన ధ్రువీకరించబడిన అడ్రస్, ఐడీ ప్రూఫ్‌లను అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.
* అకౌంట్ ఓపెన్ అయ్యాక కస్టమర్ ఆ అకౌంట్‌లో బ్యాంకు సూచించిన మేర నిర్దిష్టమైన మొత్తాన్ని మినిమం బ్యాలెన్స్ ఉండేందుకు డిపాజిట్ చేయాలి.
సేవింగ్ ఖాతాలను తెరిచే వారికి ఎస్‌బీఐ నామినేషన్ సౌకర్యం అందిస్తోంది. కస్టమర్లు తమ అకౌంట్లను నామినీలను పెట్టుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఈ ఆప్షన్‌ను అందిస్తారు. అక్కడ నామినీగా ఎవరు ఉండాలో ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులల్లో ఎవర్ని అయినా నామినీలుగా పెట్టుకోవచ్చు. అయితే నామినీలు మైనర్ అయితే వారికి 18 ఏళ్లు నిండాకే ఆ అకౌంట్లపై హక్కులు లభిస్తాయి.
ఇక ఎస్‌బీఐ అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ముందుగా ఎస్‌బీఐ హోం పేజీలోకి వెళ్లి అప్లై నౌ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం సేవింగ్స్ అకౌంట్‌ను ఎంచుకోవాలి. తరువాత ఫాం నింపాలి. అనంతరం సబ్‌మిట్ క్లిక్ చేయాలి. దీంతో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తవుతుంది. తరువాత కస్టమర్లు తాము ఎంచుకున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి అక్కడ కేవైసీ పత్రాలను చూపించి అకౌంట్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయించుకోవచ్చు. పత్రాలన్నీ సరిగ్గా ఉంటే 3 నుంచి 5 రోజుల్లోగా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
అకౌంట్ యాక్టివేట్ అయ్యాక కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్ వెల్‌కమ్ కిట్‌ను ఇస్తారు. అందులో చెక్ బుక్, డెబిట్ కార్డు, పే ఇన్ స్లిప్స్, ఇతర వివరాలతో కూడిన పత్రాలు ఉంటాయి. కస్టమర్లు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. కాకపోతే ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసి అందులో పైన తెలిపిన విధంగా స్టెప్స్ ను పాటించాలి. మరిన్ని వివరాలకు ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హెల్ప్ లైన్ నంబర్ 1800 112 211 లో సంప్రదింవచ్చు.