బైక్‌ను మనం రైలులో ట్రాన్స్ పోర్ట్ చేయాలంటే రెండు రకాల ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి.. బైక్‌తోపాటు మనం అదే రైలులో వెళ్తే.. రైలు బయల్దేరే సమయానికి కనీసం 2 గంటల ముందైనా రైల్వే స్టేషన్‌లోని లగేజ్ ఆఫీస్‌కు వెళ్లాలి.
మాధవ్ వైజాగ్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి హైదరాబాద్‌లో జాబ్ వచ్చింది. దీంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. అయితే సామాన్లు, కుటుంబ సభ్యులు ఎలాగో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కానీ అతనికి ఉండే బైక్‌ను షిఫ్ట్ చేయడం కష్టంగా మారింది. అంత దూరం బైక్‌పై ప్రయాణం చేయలేడు. దాన్ని సామాన్లతో పంపించనూ లేడు. దీంతో ఏం చేయాలో తెలియక అవస్థ పడ్డాడు. అయితే అప్పుడే అతనికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే బైక్‌ను పార్శిల్ చేసి ట్రెయిన్‌లోకి ఎక్కించాడు. తానూ.. దాంతోపాటే షిఫ్ట్ అయిపోయాడు..
ప్రస్తుతం ఉద్యోగం లేదా పలు ఇతర కారణాల రీత్యా ప్రాంతాలు మారే వారికి టూవీలర్స్ ట్రాన్స్‌పొర్టేషన్ చాలా ఇబ్బందిగా మారుతోంది. పైన చెప్పిన మాధవ్ లాగే అనేక మంది తమ తమ బైక్‌లను ఎలా ట్రాన్స్‌పోర్ట్ చేయాలో తెలియక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారి కోసమే రైల్వే అద్భుతమైన అవకాశం ఇస్తోంది. రైళ్లలో కేవలం మనమే కాదు, మనతో మన బైక్‌లను కూడా ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు. మనం వెళ్లకపోయినా బైక్‌లను ట్రాన్స్‌పోర్ట్ చేస్తే అవతలి వైపు వారు డెలివరీ తీసుకుంటారు. ప్రస్తుతం రైళ్లలో ఈ రెండు తరహా ట్రాన్స్‌పోర్ట్ విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే బైక్‌లను రైళ్లలో ఎలా ట్రాన్స్‌పోర్ట్ చేయాలంటే..?
బైక్‌ను మనం రైలులో ట్రాన్స్ పోర్ట్ చేయాలంటే రెండు రకాల ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి.. బైక్‌తోపాటు మనం అదే రైలులో వెళ్తే.. రైలు బయల్దేరే సమయానికి కనీసం 2 గంటల ముందైనా రైల్వే స్టేషన్‌లోని లగేజ్ ఆఫీస్‌కు వెళ్లాలి. అక్కడ బైక్‌కు చెందిన ఆర్సీ, ఇన్సూరెన్స్ జిరాక్స్ పేపర్లను ఇవ్వాలి. అలాగే బైక్ ఎంత విలువ ఉంటుందో చెప్పాలి. బైక్ ఇంజిన్, చాసిస్ నంబర్లు, రిజిస్ట్రేషన్ నంబర్‌లను ఫాంలో ఎంటర్ చేయాలి. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్ పత్రాలను ఇవ్వాలి. దాంతోపాటు బైక్‌లో ఉండే పెట్రోల్ మొత్తం తీయాలి. ఆ తరువాత బైక్‌ను పార్శిల్ చేస్తారు. ఆ సమయంలో మనకు రైల్వే వారు ఒక స్లిప్ ఇస్తారు. అప్పుడు ట్రాన్స్‌పోర్టు చార్జిలను చెల్లించాలి. ఇక రైలు గమ్యస్థానానికి చేరుకోగానే ఆ స్లిప్‌ను చూపిస్తే బైక్‌ను డెలివరీ ఇస్తారు. అయితే అదే రైలులో మనం ప్రయాణించిన సందర్భంలో మనం రైలు దిగగానే వెంటనే బైక్‌ను తీసుకుని మనం వెళ్లాలనుకునే ప్రాంతానికి బైక్‌పై వెళ్లవచ్చు.
ఇక రెండోది.. బైక్‌తో మీరు వెళ్లకుండా కేవలం బైక్‌ను మాత్రమే ట్రాన్స్‌పోర్ట్ చేయాలని అనుకుంటే రోజులో ఎప్పుడైనా బుకింగ్ చేసుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు బైక్ పార్శిల్ చేయాలి. అనంతరం చార్జిలను చెల్లించాలి. ఇక బైక్‌ను రైల్వే వారు ఏదో ఒక ట్రెయిన్‌లో గమ్యస్థానానికి ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. ఆ విషయం మీకు చెబుతారు. దీంతో అవతలి వారు ఆ ట్రెయిన్ వెళ్లే సమయానికి స్టేషన్‌కు వెళ్లి బైక్‌ను డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అవతలి వారు కూడా బైక్ డెలివరీ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రెండు రకాలుగా మన టూవీలర్స్‌ను మనం రైళ్లలో ట్రాన్స్‌పోర్ట్ చేయవచ్చు..!