ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త రూల్స్.. వివరాలు ఇవే..!

-

మీకు ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ లో ఎకౌంట్ ఉందా..? అయితే మీరు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. క్యాష్ విత్‌డ్రాయెల్స్, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్ బుక్ చార్జీల రూల్స్ ని మారుస్తున్నట్టు తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఐసీఐసీఐ/ ICICI
ఐసీఐసీఐ/ ICICI

ఏడాదిలో 25 చెక్స్ ఉచితంగానే లభిస్తాయి. తర్వాత పది చెక్‌ లీవ్స్ కలిగిన ప్రతి అదనపు చెక్‌బుక్‌కు రూ.20ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి అదనపు లావాదేవీపై రూ.150 ఛార్జీ వర్తిస్తుంది. అలాగే వ్యాల్యూ లిమిట్ కూడా ఉంది.

ఒక నెలలో గరిష్ఠంగా నాలుగు నగదుతో కూడిన లావాదేవీలు అంటే జమ మరియు ఉపసంహరణను ఉచితంగా జరిపేందుకు బ్యాంకు అవకాశం ఇచ్చింది గమనించండి.

అలానే హోమ్ బ్రాంచ్ అకౌంట్‌లో కలిగిన వారికి నెలకు రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్లు చెయ్యచ్చు. అదే నాన్‌ హోంబ్రాంచిలో అయితే రోజుకి రూ.25 వేల లావాదేవీల వరకు ఉచితం. నెక్స్ట్ చేసే ట్రాన్సక్షన్ కి రూ.150 వసూలు చేస్తారు.

మంత్లీ మినిమమ్‌ యావరేజ్‌ బ్యాలెన్స్‌-ఎంఏబీ ఖాతాలో సరిగా మెయింటెన్‌ చేయనట్లైతే బ్యాంకు బ్రాంచి లేదా బ్యాంక్‌ క్యాష్‌ రీసైక్లర్‌ మెసీన్లలో జరిపే తొలి రెండు ఉచిత ఆర్థిక లావాదేవీలకు రూ.100ల రుసుము వసూలు చేయనున్నారు.

తర్వాత జరిపే ప్రతి అదనపు లావాదేవీకి రూ.125లు రుసుము వర్తిస్తుంది. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తే నెలలో తొలి ట్రాన్సాక్షన్‌కు చార్జీలు ఉండవు. తర్వాత రూ.1000కి రూ.5 పడుతుంది.

ఇది ఇలా ఉండగా ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో నాన్‌ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో జరిపే తొలి మూడు ట్రాన్సక్షన్స్ ఫ్రీ. ఇతర ప్రాంతాల్లో తొలి ఐదు లావాదేవీలు ఉచితం.

తర్వాత ప్రతి అదనపు ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేతర లావాదేవీకి రూ.8.50 ఛార్జీ వసూలు చేయనున్నారు. బ్యాంక్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు ఐసీఐసీఐ ప్రకటించింది .

Read more RELATED
Recommended to you

Latest news