ఏపీ లోని పలు జిల్లాలలో పిడుగులు పడతాయని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో కృష్ణా , గుంటూరు , ప్రకాశం , నెల్లూరు జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు జారీ చేయగా.. రాయలసీమలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ వెల్లడించింది.
కృష్ణా జిల్లా విషయానికి వస్తే.. విజయవాడ అర్బన్ & రూరల్, పెనమలూరు , కంకిపాడు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, చందర్లపాడు, పెడన, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, ముదినేపల్లి, గుడూరు, మొవ్వ, ఘంటశాల, చాట్రాయి, విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం ప్రాంతాల్లో పిడుగులు పడతాయని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
గుంటూరు జిల్లా విషయానికి వస్తే.. తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, పెదకాకాని, తాడికొండ, వెల్దుర్తి, చిలకలూరిపేట ప్రాంతాల్లో పిడుగులు పడనున్నట్లు వెల్లడించింది. ఇక ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, మార్కపూరం, అర్ధవీడు, పర్చూర్, యద్దనపూడి, మార్టూర్ ప్రాంతాల్లో.. నెల్లూరు జిల్లాలో పొదలకూర్ , మనుబోలు , సూళ్ళూరుపేట ప్రాంతాల్లో పిడుగులు పడనున్నట్లు విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ పేర్కొంది.