మొబైల్ నెంబర్ తో లింక్ చెయ్యకపోతే ఆధార్ కార్డు ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ లేకపోతే ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ధిపొందాలన్నా.. చిన్నారులు స్కూల్ లో చేరాలన్నా, టికెట్లు బుక్ చేయాలన్నా… ఏది అవ్వదు అన్న సంగతి మనకి తెలుసు. అయితే కొన్ని సార్లు మనం ఆధార్ ని ఆన్లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం.

అయితే మొబైల్ నెంబర్ లింక్ చేస్తే డౌన్లోడ్ అయ్యిపోతుంది అని.. ఆధార్ కు మొబైల్ నంబర్ ను లింక్ చేయకపోతే ఆధార్ కార్డును మళ్లీ డౌన్ లోడ్ చేయడం అవ్వదు అని కొందరు భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు. మీ ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వక పోయిన సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూసేద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే చూసేయండి.

దీని కోసం ముందుగా యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ను ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత Order Aadhaar Reprint ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
నెక్స్ట్ మీరు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీని ఎంటర్ చెయ్యండి. ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ నమోదు చేయాలి.
ఇప్పుడు మీరు My Mobile number is not registered అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి.
ఆ తర్వాత సెండ్ OTP పైన క్లిక్ చేసి.. Terms and Conditions ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఓటీపీ నమోదు చేసిన తర్వాత Preview Aadhaar Letter పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు పేమెంట్ పూర్తి చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి అంతే.