లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న పురుషుడికి రక్షణ కల్పించాలంటూ పంజాబ్ మరియు హైర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరిచింది. 2018 సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 (వ్యభిచారం) రద్దు చేయబడింది. కాగా తమకు రక్షణ కల్పించాలంటూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఓ జంట కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ విధమైన తీర్పును ఇచ్చింది. పంజాబ్ కు చెందిన ఓ జంట లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే రిలేషిప్ లో ఉన్న యువకుడికి అప్పటికే వివాహం జరిగి విడాకులకు అప్లై చేసుకోగా అతడి భార్య తరపున కుటుంబ సభ్యులు యువకుడిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో ఆ జంట కోర్టును ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరటంతో కోర్టు ఈ విధమైన తీర్పును ఇచ్చింది. పిటిషనర్ జంట తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు…సామర్ల పోలీస్ స్టేషన్ లో రక్షణ కల్పించాలని కోరింది. పిటిషనర్ తరపున న్యాయవాది దినేష్ మహరాజన్ మాట్లాడుతూ..తమ క్లయింట్ కు ఇప్పటికే పెళ్లి కాగా విడాకుల కోసం అప్లై చేసుకున్నాడని దాదాపు విడాకులు కూడా ఖరారు అయ్యాయని..దాంతో ప్రస్తుతం తనకు నచ్చిన మరో యువతితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని తెలిపారు.
Big News: మగవారికి గుడ్ శుభవార్త.. లివింగ్ రిలేషన్ షిప్ పై హైకోర్టు సంచలన తీర్పు
-