ఇంటర్నెట్ లేకపోతే ఇలా పేమెంట్ చెయ్యచ్చు..!

-

మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ అయిపోయిందా…? అయితే మీరు ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోయినా పేమెంట్ ని పూర్తి చేయొచ్చు. ఇంటర్నెట్ లేకపోతే పేమెంట్ లో ఇబ్బంది వస్తుంది కనుక ఈ సర్వీస్ ని తీసుకొచ్చారు. అయితే దీనికోసం మీరు మీ ఫోన్ ని ఫ్రీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ తో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. యూపీఐ పేమెంట్ ని ఇంటర్నెట్ లేకుండా ఎలా చేయాలి అనేది ఇక్కడ ఉంది మరి ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేయండి.

upi

 

పేమెంట్ చేయడానికి ముందు మీరు BHIM app ని డౌన్లోడ్ చేసుకోవాలి.
అక్కడ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని పూర్తి చేసేయండి.
ఆ తర్వాత మీరు ఆఫ్లైన్ యూపీఐ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు.
అయితే మీరు ఇక్కడ మీ సిమ్ కార్డ్ మరియు మీ ఫోన్ నెంబర్ సరైనవి అయి ఉండేటట్లు చూసుకోండి.
అలాగే బ్యాంకు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా సరైనవి అయి ఉండాలి. ఇప్పుడు మీ ఫోన్లో మీరు డయల్ ప్యాడ్ ని ఓపెన్ చేసి *99 # ని ప్రెస్ చేయండి.
ఇప్పుడు మీకు ఏడు ఆప్షన్స్ వస్తాయి. సెండ్ మనీ, రిసీవ్ మనీ, చెక్ బ్యాలెన్స్ , మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్స్ మరియు సెట్ యూపీఐ పిన్.
ఇక్కడ మీరు ఒకటి నొక్కి సెండ్ మనీ అనేది ఎంచుకోవాలి. అయితే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ని ఉపయోగించి మీరు డబ్బులు పంపించు అలానే యూపీఐ లేదా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ తో మీరు డబ్బులు పంపించచ్చు.
పేమెంట్ మెథడ్ లో మీరు ఫోన్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ వ్యక్తికీ పమ్పాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ ని టైపు చెయ్యాలి.
అదే ఒకవేళ మీరు యూపీఐ ఐడి ఆప్షన్ ను ఎంచుకుంటే మీరు పంపించే వ్యక్తి యొక్క యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ పంపాలి అనుకుంటున్నారు అది ఎంటర్ చేయండి.
జస్ట్ మీరు గూగుల్ పే పేటీఎం లో ఎలా పంపుతారో ఇందులో కూడా అంతే.
ఇప్పుడు మీరు 6 డిజిట్ యూపీఐ పిన్ నెంబర్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సెండ్ చేయండి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news