ఇక ఆఫీసుల్లో పాన్ కార్డు ఇవ్వకపోతే, సాలరి కట్…!

-

ఈ రోజుల్లో ప్రతీ ఆర్ధిక లావాదేవీలకు కూడా పాన్ కార్డ్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. దాదాపు అన్ని రంగాల్లోనూ పాన్ కార్డ్ ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుగుతున్న నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పాన్ కార్డ్ ని తప్పని సరి చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఉద్యోగులందరూ,

తమ కార్యాలయాల్లోని హెచ్ఆర్ లేదా అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో పాన్ నెంబర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం పాన్ కార్డు ఇవ్వని ఉద్యోగుల నుంచి టీడీఎస్ 20% కట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ ఆదేశాలు ఇచ్చింది. మీ టీడీఎస్ డిడక్షన్‌కు సంబంధించిన వివరాలను TRACES పోర్టల్‌ చూసుకునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ ప్రకారం,

2019-20 ఆర్థిక సంవత్సరానికి మీ వార్షికాదాయం రూ.2.5 లక్షలు లోపు ఉన్నట్టైతే మీరు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 192 ప్రకారం జీతం రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే టీడీఎస్ వర్తించదు. రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలి. ఒకవేళ పాన్ కార్డ్ వివరాలు ఇవ్వకపోతే మీ జీతంలో 20% కన్నా ఎక్కువ టీడీఎస్ కట్ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version