నూతనంగా ప్రవేశ పెట్టబడిన బడ్జెట్ ప్రకారం.. ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఉన్న వారు ఇలా చేస్తే ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదు. పైగా డబ్బు కూడా ఆదా చేయవచ్చు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్‌సభలో 2019-20 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. అందులో భాగంగా గృహ రుణాలు, ఎలక్ట్రిక్ వాహనాల రుణాల వడ్డీలపై రాయితీలను ప్రకటించారు. ఈ క్రమంలో ఆ రాయితీలను కలుపుకుంటే ఆదాయపు పన్ను కట్టేవారు ట్యాక్స్ నుంచి కొంత వరకు బయట పడవచ్చు. అయితే ఏడాదికి రూ.12 లక్షల వరకు సంపాదించే వారు కొత్త నిబంధనల ప్రకారం ట్యాక్స్ కట్టకుండా, డబ్బును ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.12 లక్షల సంపాదన ఉన్నవారు ట్యాక్స్ ఇలా ఫైల్ చేస్తే పన్ను భారం తప్పుతుంది. డబ్బు ఆదా అవుతుంది.
సంపాదన – రూ.12,00,000
స్టాండర్డ్ డిడక్షన్ – రూ.50,000
———————————————————-
డిడక్షన్ తరువాత సంపాదన – రూ.11,50,000
హోమ్ లోన్ వడ్డీపై రాయితీ – రూ.3,50,000
ఎలక్ట్రిక్ వాహన రుణం వడ్డీపై రాయితీ – రూ.1,50,000
———————————————————-
మొత్తం సంపాదన – రూ.6,50,000
80సి సెక్షన్ ప్రకారం పీఎఫ్, ఈపీఎఫ్, పిల్లల స్కూల్ ఫీజులకు మినహాయింపు – రూ.1,50,000
80సీసీడీ (1బి) ప్రకారం ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ మినహాయింపు – రూ.50,000
80డి ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు – రూ.75,000
———————————————————-
టాక్స్ వర్తించే ఆదాయం – రూ.3,75,000
రూ.2.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు – చెల్లించాల్సింది సున్నా
ఆ తరువాతి రూ.2.50 లక్షల ఆదాయానికి వర్తించే పన్ను 5 శాతం – 6,250
ఆ తరువాతి ఆదాయానికి వర్తించే పన్ను 20 శాతం – చెల్లించే పన్ను సున్నా
———————————————————-
కట్టాల్సిన ఆదాయపు పన్ను – రూ.6,250
హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ 4 శాతం – రూ.250
———————————————————-
కట్టాల్సిన ఆదాయపు పన్ను – 0 (సెక్షన్ 87ఎ ప్రకారం రూ.12,500 వరకు రిబేట్ వస్తుంది)
పైన చెప్పిన విధంగా మీకు వచ్చే రూ.12 లక్షల ఆదాయాన్ని విభజించుకుంటే ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది.