ఇప్పటికే పలు ఇతర భాషల్లో ఈ షో ప్రారంభమైనా తెలుగులో ఇంకా ప్రారంభం కాకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. అయినా ఎట్టకేలకు షో ప్రారంభమవుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగులో బిగ్ బాస్ తొలి సీజన్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. తారక్ హోస్టింగ్‌తో ఆ షోకు మరింత ఊపు వచ్చింది. దీంతో రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఆశగా ఎదురు చూశారు. అయితే వ్యాఖ్యాతగా తారక్‌కు బదులుగా నాని వచ్చాడు. ఎన్‌టీఆర్‌లా కాకపోయినా నాని తనదైలిలో షోను హోస్ట్ చేశాడు. కానీ నానికి అంతగా పేరు రాలేదు. పైగా కౌశల్ ఆర్మీ వల్ల, వారం వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు ఎవరో ముందే లీక్ అవడం వల్ల రెండో బిగ్ బాస్ షోకు ఆదరణ తగ్గింది. ఈ క్రమంలోనే ఈ సారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా మరింత పకడ్బందీగా బిగ్ బాస్ సీజన్ 3 ని నిర్వహించనున్నారు.
ఇక ఈసారి బిగ్‌బాస్ షోకు ప్రముఖ నటుడు నాగార్జున హోస్ట్‌గా రానున్న విషయం విదితమే. దీంతో ఈసారి ఈ షో జనాలను అలరిస్తుందనే స్టార్ మా భావిస్తోంది. అయితే ఈ షోకు ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు దొరికినా.. ఇంకా పూర్తిగా కంటెస్టెంట్లు లభించకపోవడంతో షో ప్రారంభం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. అయితే మరో వారం, పది రోజుల్లో కంటెస్టెంట్ల ఎంపికను పూర్తి చేయడంపాటు అతి త్వరలోనే షోను ప్రారంభించాలని స్టార్ మా ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3ని ఈ నెల 21వతేదీ నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా వెల్లడించకపోయినా.. ఈ తేదీయే కన్‌ఫాం అని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు ఇతర భాషల్లో ఈ షో ప్రారంభమైనా తెలుగులో ఇంకా ప్రారంభం కాకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది. అయినా ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుండడంతో ఎట్టకేలకు షో ప్రారంభమవుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అదే తేదీన షో ప్రారంభం ఉంటుందా, లేదా అన్నది మరికొన్ని రోజుల పాటు వేచి చూస్తే తెలుస్తుంది..!