రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్…!

మీరు రైలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ వుంటారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఇక పండుగ సీజన్ షురూ అవుతోంది. అందుకనే ఇండియన్ రైల్వేస్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించడానికి రెడీ అవుతోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్ రైల్వేస్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించడానికి సిద్ధం అవుతోంది.

train

దీనితో అక్టోబర్ 10 నుంచి ఇండియన్ రైల్వేస్ దాదాపు 1500 ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌ను నడపనుందని తెలుస్తోంది. ఈ వార్త ప్రయాణికులకు రిలీఫ్ ని ఇస్తుంది. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 7 నుండి దసరా మొదలు అవుతోంది. అయినప్పటికీ ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించక పోవడం గమనార్హం. అయితే కోవిడ్ 19 పరిస్థితులు సహా గూడ్స్ ట్రైన్స్‌కు ఫుల డిమాండ్ ఉండటం ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా రానున్న రోజుల్లో మాత్రం ఇండియన్ రైల్వేస్ స్పెషల్ ట్రైన్స్‌ను ప్రకటించే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వ్యాక్సినేషన్ కారణంగా గత ఏడాది పండుగ సీజన్‌లో కన్నా ఈసారి ప్రయాణికుల రద్దీ పెరగనుండటం దీనికి కారణం. ఇక పోతే ఇండియన్ రైల్వేస్‌పై కరోనా వైరస్ వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రయాణికుల ఆదాయం తగ్గిపోయింది. అందుకే దీంతో ఇండియన్ రైల్వేస్ ఈసారి పండుగల కోసం ప్రయాణికులకు ప్రత్యేక ట్రైన్స్‌ను అందుబాటులో ఉంచనుందని స్పష్టంగా తెలుస్తోంది.