తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, చెరువుల్లో కి భారీగా వర్షపు నీరు చేరుతుంది. అయితే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఉక్క పోత పెరిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే తాజాగా వాతావరణ శాఖ ఏపీకి చల్లని కబురు చెప్పింది.
ఏపీ లో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రాయలసీమ తో పాటు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావంతో తో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది వాతావరణ శాఖ వెల్లడించింది.