హోమ్ లోన్ వడ్డీ భారాన్ని ఇలా తగ్గించుకోవచ్చు…!

-

సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇది కరెక్ట్ టైం. ఎందుకు అంటే అనేక బ్యాంకులు, హౌసింగ్​ ఫైనాన్స్​ కంపెనీలు గత 15 ఏళ్లలో ఎప్పుడ లేనంతగా హోమ్​లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహీంద్రా బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్లని తగ్గించాయి.

ఎస్​బీఐ లో రూ .75 లక్షల వరకు తీసుకునే హోమ్​లోన్ల​ పై 6.7 శాతం, రూ 75 లక్షలకు పైబడి తీసుకునే రుణాల పై 6.75 శాతం మాత్రమే వడ్డీని వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే మహిళా రుణగ్రహీతలు 5 బిపిఎస్​ అదనపు వడ్డీ రాయితీని కూడా ఇవ్వడం జరుగుతోంది.

కొత్తగా హోమ్ లోన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్లు నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంక్స్ ని ప్రిఫర్ చెయ్యండి. ఈ సమాచారం కోసం మీరు బ్యాంకుల అధికారిక వెబ్​సైట్లను చూడాలి. వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఇతర ఖర్చులని కూడా గమనించండి. మీ జీతం, నెలవారీ ఖర్చులను పరిగణలోకి తీసుకొని తక్కువ వ్యవధిని ఎంచుకోండి. అలానే ఎక్కువ డౌన్​ పేమెంట్​తో హోమ్ ​లోన్​ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.

ఇదివరకే ఏదైనా బ్యాంకులో హోమ్​లోన్​ తీసుకున్నట్లైతే మీరు మీ వడ్డీ భారాన్ని ఇలా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గాయి కనుక మీ లోన్​ అకౌంట్​ను పాత బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ అందించే బ్యాంకుకు బదిలీ చేసుకోండి. లేదంటే మీ లోన్​లో కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడం కనుక చేస్తే రుణ బ్యాలెన్స్‌ను తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news