కొత్త రూల్.. వాహనాలపై స్టిక్కర్లు ఉంటే చలానా కట్టాల్సిందే..!

-

ఏ వాహనం నెంబర్ ప్లేటు అయినా సరే.. రవాణా శాఖ నిబంధనకు లోబడి ఉండాలి. అయితే.. చాలామంది వాహనదారులు రవాణా శాఖ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు.

ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఆర్మీ, డిఫెన్స్ అంటూ వాహనాల మీద చాలామంది స్టిక్కర్లు అతికిస్తుంటారు. అటువంటి వాళ్లు ఓసారి ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పటి వరకు వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు ఉన్నా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ.. ఇక నుంచి అటువంటి స్టిక్కర్లు మీ వాహనాలపై ఉంటే మీరు చలానా కట్టాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా స్టిక్కర్లు అతికించిన వాహనాలను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వాళ్లకు మీరు దొరికారో అంతే అడ్డంగా బుక్కవ్వాల్సిందే.

ఏ వాహనం నెంబర్ ప్లేటు అయినా సరే.. రవాణా శాఖ నిబంధనకు లోబడి ఉండాలి. అయితే.. చాలామంది వాహనదారులు రవాణా శాఖ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారు. నెంబర్ ప్లేట్‌పై తమకు ఇచ్చిమొచ్చిన రాతలు రాస్తున్నారు. నెంబర్ ప్లేట్‌ను కూడా ఇష్టమున్నట్లుగా మార్చుకుంటున్నారు. 8055 అంటే BOSS అని, ఇలా రకరకాలుగా మార్చేస్తుంటారు.

 

మరికొందరైతే వాహనం నెంబర్లు కనిపించకుండా.. దానిమీద ఏవేవో రాతలు రాస్తుంటారు. అయితే… వాహనానికి నెంబర్ అనేది చాలా ముఖ్యం. దేనికైనా వాహనం నెంబర్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు. పోలీసులకు బండి నెంబర్ ఒక్కటి తెలిస్తే చాలు.. ఆ బండి జాతకం అంతా చెబుతారు. అయితే.. కొందరు వాహనదారులు కావాలని నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తున్నారు. ఇదివరకు ఇటువంటి వాళ్లకు పోలీసులు ఎన్నోసార్లు వార్నింగ్‌లు ఇచ్చారు. కానీ.. అటువంటి వాహనదారులు మాత్రం మారడం లేదు. దీంతో చలాన్లు విధించడమే కరెక్ట్ అని వాళ్లకు చలాన్లు విధిస్తున్నారు.

15, 16న స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు

దీనిలో భాగంగా.. ట్రాఫిక్ పోలీసులు ఈనెల 15, 16న పోలీస్ స్టిక్కర్ అతికించిన వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందకున్నా… తమ వాహనాలపై పోలీస్ అని రాసుకున్న 104 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 147 వాహనాల స్టికర్లను తీసేయించారు. ఇక నుంచి ప్రతి రోజు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version