ఎలియన్స్‌ ఉండేదీ… సముద్రగర్భంలోనా!

సాధారణంగా ఎలియన్స్‌ గూర్చిన వార్త తెలిస్తే చాలు.. మనం ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అవి అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించిన దృశ్యాలు స్పేస్, ఆకాశంలో కనిపించి వెళతాయి. కానీ, యూఎఫ్‌ఓ ఫాలోయర్స్, నిపుణులు ఎలియన్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మనకు ఆకాశంలో కనిపించే ఆ దృశ్యాలు నిజమైనవా? కావా? అనే ప్రశ్నలు పుట్టుకువస్తాయి. ఐసీఈఆర్‌ ఉప అధ్యక్షుడు గేరీ హసెల్‌టినెవ్‌ దీనికి స్పష్టమైన వివరణ ఇచ్చారు. మనకు అప్పుడప్పుడు ఆకాశంలో కనిపించే స్పేస్‌లో నుంచి రావట… అవి సముద్ర గర్భం నుంచి వస్తాయనే ఆశ్చర్యకర విషయాలను తెలిపారు.

 

27 దేశాలవ్యాప్తంగా యూఎఫ్‌ఓ (Undefined flying saucers) ప్రతినిధులు కూడా ఎలియన్స్‌పై ప్రత్యేక పరిశోధనలు చేశారు. హసెల్‌టిన్‌ ఇటీవల యూఎస్‌ నేవీకి యూఎఫ్‌ఓ (వింత ఫ్లైయింగ్‌ సాసర్‌)లో ఉన్నవారికి జరిగిన వీడియోను మనం చూశామని, ముఖ్యంగా ఈ యూఎఫ్‌ఓలు దారి మళ్లిస్తాయని చెప్పారు. ఈ యూఎఫ్‌ఓలు తరచుగా సముద్రంలో నుంచి వస్తాయని, సముద్ర అంతర్భాగంలో ఎలియన్స్‌కు సంబంధించిన తవ్వకాలు కూడా ఇందుకు సాక్ష్యం.

ఇది వింతగా ఉన్నా.. మనకు సముద్రవ్యాప్తంగా కేవలం 5 శాతం మాత్రమే పూర్తిగా తెలుసుకోగలిగాం అని, దీనికి మించిన విషయాలను మనం చంద్రుడు, స్పేస్‌ గురించి తెలుసుకున్నాం. కానీ, సముద్రం గురించి మనం తెలుసుకోలేదు అన్నారు. అందుకే సముద్రంపైనే ఈ ఫ్లయింగ్‌ సాసర్‌లు దర్శనమిస్తున్నాయని హసల్‌టైన్‌ అన్నారు. ఇటీవల ఒక ఫిల్మ్‌లో కూడా వీటికి సంబంధించిన వీడియోలను చూశాం. ప్రత్యేకంగా యూఎస్‌ నేవీ యూఎఫ్‌ఓలకు సంబంధించిన 7 వీడియోలను విడుదల చేసినప్పటి నుంచి వీటిపై అనుమానాలు పెరిగాయి.