ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ అంత ఈజీ కాదు!

-

మీరు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలనుకుంటున్నారా? మీరు వెంటనే లైసెన్స్‌ తీసుకోండి. లేకపోతే రానున్న రోజుల్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశముంది. దీంతో మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. ఇప్పుడు ఆ నిబంధనలు ఏంటో మనం తెలుసుకుందాం.

రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసే వారి కోసం, భద్రత లక్ష్యంతో ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్‌ల నిబంధనలు మరింత కఠినతరం చేయనుంది. ఈ కొత్త రూల్స్‌ అమల్లోకి వస్తే ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌ అంత సులభంగా రాదు. కొత్త నిబంధనల్లో భాగంగా ముందుగా దరఖాస్తుదారుడు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి డ్రైవింగ్‌ టెస్ట్‌కు నెల ముందు వీడియో ట్యూటోరియ్‌ చూడాల్సి ఉంటుంది. దీనిలో డ్రైవింగ్‌కు సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటాయి. దీంతోపాటు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబాలతో మాట్లాడిస్తారు. దీనివల్ల వాహనదారుడు రోడ్డు ప్రమాదం వల్ల చనిపోవడంతో ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తారు. హెల్మెట్‌ లేకుండా టూవీలర్‌ నడిపేవారికి భారీ జరిమానాలు వేస్తారు. వీడియో ఫూటేజీ ద్వారా పోలీసులు చలానాలు విధించే ఛాన్స్‌ కూడా ఉంది. ఇదిలా ఉండగా 2019లో 44,666 మంది టూవీలర్‌ డ్రైవర్లు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.

ఈ నిబంధనలు 2021 నవంబర్‌ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని నివేధికలు పేర్కొంటున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇదివరకే ఉన్నా కానీ, మీరు కనుక ట్రాఫిక్‌ నిబంధనలను బ్రేక్‌ చేస్తే అప్పుడు మీరు సేఫ్టీ సర్టిఫికేట్‌ కోర్సులో పాస్‌ కావాలి. దీనికోసం మీకు మూడు నెలల గడువు ఇస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఆధార్‌ నంబర్‌ను డ్రైవింగ్‌ లైసెన్స్‌తో లింక్‌ చేస్తారు. దీని ద్వారా వారి డ్రైవింగ్‌ను గమనిస్తారు. ఇది భద్రతతో కూడిన డ్రైవింగ్‌కు ఒక నిబంధనలా పనిచేస్తుంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను కూడా ఒక విధంగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news