రూ.399 ధరకే జీయో ఫైబర్‌ అద్భుతమైన ప్లాన్స్‌

-

వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ క్లాసుల కోసం మీరు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే జియోఫైబర్‌ అందిస్తున్న అద్భుతమైన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ గురించి తెలుసుకోండి. రిలయెన్స్‌ జియో జియోఫైబర్‌ పేరుతో పలురకాల బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌ అందిస్తోంది. నెలకు రూ.399 ధర నుంచే మొదలవుతాయి. మంత్లీ ప్లాన్స్‌ రూ.399 నుంచి రూ.8,499 మధ్య ఉన్నాయి. జియోఫైబర్‌. ఇంటర్నెట్‌ స్పీడ్‌ 30ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీపీఎస్‌ వరకు ఉంటుంది. మీరు ఎంచుకునే ప్లాన్స్ ను బట్టి ఈ స్పీడ్‌ మారుతుంది. ఇంటర్నెట్‌ లాభాలతో పాటు అన్లిమిటెడ్‌ కాల్స్‌ పొందవచ్చు. ఎలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయో తెలుసుకుందాం.


ఇక రిలయెన్స్‌ జియో 150ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో 30 రోజుల ఉచిత ట్రయల్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉచితం. 13 ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఒకవేళ 30 రోజుల్లో సర్వీస్‌ నచ్చకపోతే కనెక్షన్‌ ఏ నిబంధనలు లేకుండా డీయాక్టివేట్‌ చేసుకోవచ్చు.

  • జియోఫైబర్‌ రూ.399 ప్లాన్‌ తీసుకుంటే 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ ఉపయోగించవచ్చు. అప్‌లోడ్‌ డౌన్లోడ్‌ స్పీడ్‌ ఒకేలా ఉంటుంది. అన్లిమిటెడ్‌ డేటా, అన్లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. జియోఫైబర్‌ రూ.699 ప్లాన్‌ తీసుకుంటే 100 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ ఉపయోగించొచ్చు. ఒకేవిధమైన అప్‌లోడ్‌ స్పీడ్, డౌన్లోడ్‌ ‌ స్పీడ్‌. అన్ లిమిటెడ్‌ డేటా వాయిస్‌ కాల్స్‌ ఉచితం.
  • జియోఫైబర్‌ రూ.999 ప్లాన్‌ తీసుకుంటే 150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌. అన్ లిమిటెడ్‌ డేటా , వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రూ.1,000 విలువైన 14 యాప్స్‌ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. అలాగే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ, జీ5, సన్‌ నెక్స్‌ట్, వూట్‌ కిడ్స్, ఆల్ట్‌ బాలాజీ, హోయ్‌చోయ్, డిస్కవరీ+, ఎరోస్‌ నౌ, జియోసినిమా, జియోసావన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.
  •  జియోఫైబర్‌ రూ.1,499 ప్లాన్‌తో 300 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్, అన్ లిమిటెడ్‌ డేటా, అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రూ.1,500 విలువైన 15 యాప్స్‌ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్‌ నెక్స్‌ట్, వూట్‌ సెలెక్ట్, డిస్కవరీ+, ఎరోస్‌ నౌ, జియోసినిమా, జియోసావన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇతర సేవలు ఉచితం.
  • జియోఫైబర్‌ రూ.2,499 ప్లాన్‌ తీసుకుంటే 500 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ అన్ లిమిటెడ్‌ డేటా, వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రూ.1,650 విలువైన 15 యాప్స్‌ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ స్టాండర్డ్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ ఇతర సేవల సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.
  • జియోఫైబర్‌ రూ.3,999 ప్లాన్‌ తీసుకుంటే 1జీబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ అన్ లిమిటెడ్‌ డేటా వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రూ.1,650 విలువైన 15 యాప్స్‌ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌. జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ స్టాండర్డ్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్‌ నెక్స్‌ట్, వూట్‌ సెలెక్ట్, వూట్‌ కిడ్స్, లయన్స్ ట్‌ ప్లే, డిస్కవరీ+, ఎరోస్‌ నౌ, జియోసావన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం.
  • జియోఫైబర్‌ రూ.8,499 ప్లాన్‌తో 1జీబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ 6600జీబీ డేటా, అన్ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ ఉచితం. రూ.1,800 విలువైన 15 యాప్స్‌ మంత్లీ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం. జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియం, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్‌ నెక్స్‌ట్, వూట్‌ సెలెక్ట్, ఇతర సేవలు ఉచితంగా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news