స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!

Join Our Community
follow manalokam on social media

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే ఇది మీకు గుడ్ న్యూస్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఉద్యోగానికి సంబంధించి వివరాలని చూస్తే.. మొత్తం 270 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

SAIL గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ షిప్ పోస్టుల వివరాలు అయితే… సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిప్లమో ఉత్తీర్ణత అవ్వాలి. వయసు 18 – 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ , ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ , మెకానికల్ అండ్ ప్రొడక్షన్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ ప్రొడక్షన్ , సివిల్ తదితర విభాగాల వారు అప్లై చేసుకోవచ్చు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే 90 పోస్టులుకి అగ్రికల్చర్, ఆటోమొబైల్ , సిరామిక్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాలు వారు అయ్యి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. అలానే వయస్సు 18 – 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ప్రతీ పోస్ట్ కి కూడా అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా మీరు దరఖాస్తు చెయ్యాలి. చివరి తేదీ 10/2/2021. పూర్తి వివరాలని www.sail.co.in లో చూడొచ్చు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...