బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి

-

తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయనే చెప్పవచ్చు. ఇటీవల బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. బీజేపీ నేత ప్రియాంక గాంధీ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారని నిరసన తెలిపి.. బీజేపీ కార్యాలయంలో రాళ్లతో దాడి చేశారు. దాడి జరిగి గొడవ సద్దు మణిగిన కొద్ది సేపటికే గాంధీభవన్ వద్దకు బీజేపీ నేతలు అటాక్ చేశారు. పోలీసులు గొడవ జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం జరిగింది.

తాజాగా ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై దాడి చేసారు కాంగ్రెస్ NSUI నాయకులు. ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది ఆఫీస్ ఫర్నిచర్.  పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. పోలీసుల ముందే దాడులు జరుగుతున్నా.. చోద్యం చూస్తున్నారా పోలీసులు అని ప్రశ్నిస్తున్నారు.  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news