రెండు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థినీ ప్రకటిస్తాం : టీపీసీసీ చీఫ్

-

తెలంగాణలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. అధికార కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థినీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. తమ అభ్యర్థిగా నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు మహేష్ కుమార్ గౌడ్.

అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ పేరు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కమిటీలలో కష్టపడి పని చేసే వారికి ఈ నెలాఖరు వరకు పదవులు ఇస్తామని పేర్కొన్నారు. జనవరి చివరి వారంలో కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు డి.వీ. సత్యనారాయణ రావును గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news