LIC : వాటే పాలిసీ…! నెల నెలా మీ అకౌంట్లోకి రూ.4 వేలు…!

-

మీరు ప్రతీ నెల డబ్బులని పొందాలనుకుంటున్నారా…? అయితే మీకు నిజంగా ఇది గుడ్ న్యూస్.
ఇప్పుడు ఎల్‌ఐసీ మీకోసం సూపర్బ్ పాలసీని అందిస్తోంది. మీరు కనుక ఒకేసారి డబ్బులు దీనిలో పెడితే…. తర్వాత మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఇది నిజమండి. మరి వివరాల్లోకి వెళితే…
దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC కస్టమర్లకు వివిధ రకాల సేవలని అందిస్తోంది. అయితే వీటిని తీసుకోవడం వల్ల రాబడితో పాటు కుటుంబ ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న పాలసీల్లో జీవన్ అక్షయ పాలసీ ఒకటి. ఇది యాన్యుటీ ప్లాన్. మీరు కనుక ఈ పాలసీ తీసుకున్నారంటే… ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మీ పాలిసీని బట్టి మీ పెన్షన్ వస్తుంది. రూ.లక్ష బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. అప్పుడు మీకు పెన్షన్ డబ్బులను ప్రతి నెలా లేదంటే మూడు నెలలకు ఒక సారి తీసుకోవచ్చు. నెల నెల వద్దు అనుకుంటే ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి కూడా పెన్షన్ తీసేసుకోవచ్చు.

ఇక ఈ పాలసీ ద్వారా మీరు నెలకు రూ.4 వేలు ఎలా పొందొచ్చు అంటే.. 30 ఏళ్ల వయసులో ఉన్న మీరు రూ.9 లక్షల మొత్తానికి ఎల్‌ఐసీ జీవన్ అక్షయ పాలసీ తీసుకున్నారని అనుకుంటే… లైఫ్ టైమ్ ఆప్షన్ తీసుకున్నారనుకోండి మీకు సంవత్సరానికి రూ.51,525 పెన్షన్ వస్తుంది. అదే ఆరు నెలలకు అయితే రూ.25,358 పెన్షన్ లభిస్తుంది. అదే మూడు నెలలకు రూ.12,578 పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా పెన్షన్ పొందాలని భావిస్తే రూ.4166 వస్తాయి. ఈ పెన్షన్ కి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే.. 30 నుంచి 85 ఏళ్ల మధ్య లో వయసు కలిగిన వారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ కూడా పెన్షన్ తీసుకోవడం వల్ల లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news