ఎల్ఐసీ కోటి రూపాయల పాలసి..ప్రీమియం ఎంత చెల్లించాలంటే..?

అతి పెద్ద లైఫ్ ఇన్సూరెన్స్‌ సంస్థ రెండేళ్ళ క్రితం ఒక పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది.. ఈ సంస్థ ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటికి జనాల్లొ మంచి స్పందన లభించింది. మరో ప్లాన్ ఎల్ఐసీ జీవన్ శిరోమణి పాలసీ..బాగా డబ్బులు సంపాదించే వ్యాపార వేత్తలకు,రిచ్ వాళ్ళ కోసం ఈ పాలసీని ప్రత్యేకంగా రూపొందించారు..ఇందులో కనీసం కోటి రూపాయలకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో వారికి కోటి రూపాయలకు పైనే మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ అష్యూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. ఎక్కువ ప్రయోజనాలతో ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లో ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ కూడా ఒకటి. మనీ బ్యాక్ కూడా వస్తుంది.అవసరానికి డబ్బులు కావాలని అనుకోనేవారికి ఇది బెస్ట్ ఆఫ్షన్..

ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ కనీస సమ్ అష్యూర్డ్ రూ.1,00,00,000. అంటే కోటి రూపాయలు. గరిష్ట పరిమితి లేదు. పాలసీ గడువు 14 ఏళ్లు, 16 ఏళ్లు, 18 ఏళ్లు, 20 ఏళ్లు. ఎంచుకున్న గడువులో నాలుగేళ్లు తగ్గించి మిగతా సంవత్సరాలపు ప్రీమియం చెల్లించాలి. అంటే 14 ఏళ్ల పాలసీకి 10 ఏళ్లు, 16 ఏళ్ల పాలసీకి 12 ఏళ్లు, 18 ఏళ్ల పాలసీకి 14 ఏళ్లు, 20 ఏళ్ల పాలసీకి 16 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ట వయస్సు పాలసీ గడువును బట్టి ప్లాను మారుతుంది.

ఓ వ్యక్తికి 30 ఏళ్లు ఉంటే అతను 14 ఏళ్ల టర్మ్‌తో కోటి రూపాయల సమ్ అష్యూర్డ్‌తో ఎల్ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్ తీసుకుంటే 10 ఏళ్ల పాటు ఏడాదికి రూ.10,75,550 + జీఎస్‌టీ చొప్పున ప్రీమియం చెల్లించాలి. అతనికి 10, 12 పాలసీ యానివర్సరీల్లో రూ.30,00,000 చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.92,50,000 లభిస్తుంది. మొత్తం రూ.1,52,50,000 బెనిఫిట్ లభిస్తుంది.అదే ప్లాన్ ను 20 ఏళ్ళ టర్మ్ తీసుకుంటే 16 ఏళ్ల పాటు ఏడాదికి రూ.6,93,350 + జీఎస్‌టీ చొప్పున ప్రీమియం చెల్లించాలి. అతనికి 16, 18 పాలసీ యానివర్సరీల్లో రూ.45,00,000 చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.95,50,000 లభిస్తుంది. మొత్తం రూ.1,85,50,000 బెనిఫిట్ లభిస్తుంది.వీటితో పాటు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..లోన్,రైడర్స్ సదుపాయం కూడా ఉంది..