ఎల్‌పీజీ సిలిండర్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా..? ఆ అక్షరాలకు అర్ధం ఏమిటి..?

-

అందరూ గ్యాస్ సిలెండర్ ని ఉపయోగిస్తూ వుంటారు. అయితే కచ్చితంగా గ్యాస్ సిలెండర్ కి సంబంధించి ఈ విషయాలని తెలుసుకోవాలి. ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో వంటకి సిలెండర్ ని వాడుతూ వుంటారు. లేదంటే వంట చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంతా దానికి అలవాటు పడ్డాం. అందుకోసమే గవర్నెమెంట్ కూడా గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతోంది. అయినప్పటికీ తప్పదు.

 

అయితే సిలెండర్ కి సంబంధించి ఈ విషయాలని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. సిలెండర్ మీద అక్షరాలు ఉంటాయి. బీ అని ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అని ఉంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డీ అని ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్ధం. ఈ అక్షరాలు సిలిండర్ ఎక్స్‌పైరీ డేట్‌ను సూచించవు.

ఇవి ఎక్స్పైరీ అని అనుకుంటే పొరపాటు. వీటిని మ్యాండేటరీ టెస్ట్స్ డ్యూ డేట్ అని చెప్పుకుంటారు. సిలిండర్ల సాధారణ లైఫ్ 15 ఏళ్లు. ఈ కాలంలో కంపెనీలు రెండు సార్లు వీటికి మ్యాండేటరీ టెస్ట్‌లు చేస్తారు. ఫెయిల్ అయిన సిలిండర్లను నాశనం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు సిలిండర్‌పై డీ 20 అని ఉంటే అప్పుడు ఆ సిలిండర్‌ను 2020 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో తనిఖీ చేసారని. అందుకే ఇలా ఉంటుంది.

ఎక్స్‌పైరీ డేట్ లేకపోతే మరీ ఎల్‌పీజీ సిలిండర్లపైన ఏ, బీ, సీ, డీ అనే ఇంగ్లీష్ అక్షరాలు ఎందుకు ఉంటాయి అనే అనుమానము చాలా మందికి కలిగే ఉంటుంది. సాధారణంగా గ్యాస్ కంపెనీలు ప్రతి సిలిండర్‌ పైన ఈ అక్షరాలను రాస్తాయి. ఒక్కో అక్షరం ఏడాదిలో మూడు నెలలను అంటే ఒక త్రైమాసికాన్ని సూచిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news