సైబర్ ఫ్రాడ్స్ కి చెక్ పెట్టడానికి MHA జాతీయ హెల్ప్‌లైన్..!

ఈ మధ్యకాలంలో ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నిజంగా ఇటువంటి వాటిని అదుపు చేయడం చాలా ముఖ్యం. యూనియన్ హోం మినిస్టరీ అందుకోసమే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ని తీసుకు వచ్చారు.

ఫ్రాడ్స్ కారణంగా ఆర్థికంగా నష్టం కలిగితే అప్పుడు ఈ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయవచ్చని చెప్పారు. ఈ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి రిపోర్ట్ చేయడం వల్ల సైబర్
మోసాల నుండి నష్టం కలగకుండా చూసుకోవచ్చు.

ప్రధాని నరేంద్ర మోదీ సేఫ్ మరియు సెక్యూర్ డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టం, మినిస్టర్ ఆఫ్ హోం ఎఫైర్స్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా ఆధ్వర్యంలో నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 155260 ఆపరేషనలైజ్డ్ చేశారు.

ఇప్పటికే దీనిని ఏడు రాష్ట్రాలు మరియు యూనియన్ టెర్రిటరీస్ ఉపయోగిస్తున్నారు. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్.

హెల్ప్‌లైన్ 2021 ఏప్రిల్ 1 న ప్రారంభించబడింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ ) సపోర్ట్ కూడా వుంది. అన్ని ప్రధాన బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వాలెట్స్ మరియు ఆన్‌లైన్ వ్యాపారులు నుండి యాక్టివ్ సపోర్ట్ వుంది.

సాఫ్ట్ లాంచ్ అయినప్పటి నుండి, రెండు నెలలలోనే, హెల్ప్‌లైన్ 155260 మోసగాళ్ల చేతుల్లోకి రాకుండా 1.85 కోట్ల రూపాయల మోసం చేసిన డబ్బును ఆదా చేయగలిగింది.