మళ్లీ బాదుడు.. పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోండి..?

-

న్యూఢిల్లీ: మరోసారి ఆయిల్ ధరలు పెరిగాయి. రెండు వారాలుగా ఆయిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఆయిల్ ధరలు పెరిగాయి. ఇవాళ జైపూర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.42గా ఉండగా.. డీజిల్ ధర లీటర్‌కు రూ.96.49గా విక్రయాలు జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేట్ రూ. 100.46గా ఉండగా డీజిల్ రూ. 95.28గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, తూర్పుగోదావరిలో 103 రూపాయలకుపైగా లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారు. చిత్తూరు, కడప, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళం, విజయవాడ, విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.102లకు పైగా ఉంది. విశాఖపట్నంలో మాత్రం లీటర్ పెట్రోల్ రూ. 101. 60గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక డీజిల్ ధరకొస్తే.. అత్యధికంగా అనంతపురంలో రూ. 97.42గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ డిజీల్ ధర రూ. 95.85గా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో రూ. 96, రూ.97కు పైగానే విక్రయాలు సాగుతున్నాయి.

తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‌, వనపర్తి, జోగులాంబ, నిజామాబాద్‌, నిర్మల్‌, కొమురంబీమ్ ఆసీఫాబాద్‌లో పెట్రోల్ ధరలు ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో రూ. 102.78గా విక్రయాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లో డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరింది. ఆదిలాబాద్‌లో లీటర్ డీజిల్ రేటు రూ. 97.49గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ రూ. 95.73గా కొనసాగుతోంది. వరంగల్‌లో డీజిల్ రూ. 95.16 పైసలుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news