రూ.135 పాల‌సీ తీసుకుని హాస్పిటల్‌లో చేరితే రూ.15,000 పొంద‌వ‌చ్చు..!

-

ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ మ్యాక్స్ బూపా కంపెనీతో క‌లిసి త‌న వినియోగ‌దారుల‌కు నూత‌న ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటికి అయ్యే ప్రీమియంలు చాలా స్వ‌ల్ప మొత్తాల్లో ఉండ‌డం విశేషం.

ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చి హాస్పిట‌ల్‌లో చేరితేనో, లేదంటే.. యాక్సిడెంట్ అయి గాయాల కార‌ణంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ కావ‌ల్సి వ‌స్తే.. చికిత్స కోసం వేల‌కు వేల రూపాయ‌ల ఖ‌ర్చు అవుతుంది. ఈ క్ర‌మంలో ఆ ఖ‌ర్చును భరించ‌డం మ‌న వ‌ల్ల కాదు. మ‌రి ఎలా..? అంటే.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ తీసుకుంటే దానికి ప్రీమియం బాగా కట్టాలి. మ‌రి మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే.. ఎలా.. ఖ‌ర్చుల‌ను ఎలా భ‌రించాలి..? అనుకునే వారికి మొబిక్విక్ అద్భుత‌మైన ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. చాలా త‌క్కువ మొత్తం ప్రీమియం చెల్లిస్తే చాలు.. హాస్పిట‌ల్ ఖ‌ర్చులను కొంత వ‌ర‌కు భ‌రించేలా ఆ సంస్థ నూత‌న ఇనూర్సెన్స్ పాల‌సీల‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

ప్ర‌ముఖ డిజిట‌ల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ మ్యాక్స్ బూపా కంపెనీతో క‌లిసి త‌న వినియోగ‌దారుల‌కు నూత‌న ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటికి అయ్యే ప్రీమియంలు చాలా స్వ‌ల్ప మొత్తాల్లో ఉండ‌డం విశేషం. రూ.135, రూ.225, రూ.400 పేరిట త‌క్కువ మొత్తంలోనే ప్రీమియం క‌లిగిన హాస్పిక్యాష్ ప్లాన్ ఇన్సూరెన్స్ ప్లాన్ల‌ను మొబిక్విక్ అందుబాటులోకి తెచ్చింది. రూ.135 ప్రీమియం చెల్లించి పాల‌సీ తీసుకుంటే నెల రోజుల పాటు రోజుకు రూ.500 చొప్పున హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయితే ఇస్తారు. అదే రూ.225 పాల‌సీ తీసుకుంటే రోజుకు రూ.1వేయి, రూ.400 ప్రీమియం చెల్లించి పాల‌సీ తీసుకుంటే రోజుకు రూ.2వేలు ఇస్తారు. ఇక వీటికి రూ.1 ల‌క్ష వ‌ర‌కు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు.

ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న చాలా వ‌ర‌కు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఎక్కువ జీతం క‌లిగిన ఉద్యోగుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని, అందుకే తాము ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ల‌ను అందుబాటులోకి తెచ్చామ‌ని మొబిక్విక్‌, మ్యాక్స్ బూపా ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఇక త‌మ వ‌ద్ద రూ.20 మొద‌లుకొని ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయ‌ని, అవి పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి స‌రిపోతాయ‌ని వారు తెలిపారు. రూ.20, రూ.60, రూ.100 చెల్లించి రూ.1 ల‌క్ష మొద‌లుకొని రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌వ‌రేజ్ ఉన్న ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల‌ను త‌మ వ‌ద్ద క‌స్ట‌మ‌ర్లు తీసుకోవ‌చ్చ‌ని వారు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఈ ఇన్సూరెన్స్ ప్లాన్లు చాలా మందికి ఉపయోగ‌ప‌డ‌తాయ‌ని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయ ప‌డుతున్నారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version