ఇక నుంచి హైదరాబాద్ లో స్టాప్ లైన్ సిగ్నల్స్.. ట్రాఫిక్ పోలీస్ సరికొత్త ప్రయోగం.. వీడియో

-

పాదాచారులు వెళ్లే జిగ్ జాగ్ క్రాసింగ్ వద్దే సిగ్నల్స్ ఉంటాయి. అవి 500 మీటర్ల ముందే వాహనదారులకు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. చెన్నైకి చెందిన అనలాగ్ అండ్ డిజిటల్ ల్యాబ్ ఈ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించింది.

సాధారణంగా సిగ్నల్స్ అంటే రోడ్డు పక్కన ఓ స్తంభం.. దాని మీద రంగు రంగుల లైట్లు కనిపిస్తాయి. ఆ లైట్లను చూసి వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాల్సి ఉంటుంది. అయితే.. టెక్నాలజీ మారింది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి.. హైదరాబాద్ లో సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

ఎల్ఈడీ స్టాప్ లైన్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ లో ప్రవేశపెట్టారు. వాహనదారులతో పాటు పాదచారులకు ఉపయోగపడేలా సరికొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్క్ వద్ద ఈ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించారు.

ఇందులో భాగంగా పాదాచారులు వెళ్లే జిగ్ జాగ్ క్రాసింగ్ వద్దే సిగ్నల్స్ ఉంటాయి. అవి 500 మీటర్ల ముందే వాహనదారులకు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. చెన్నైకి చెందిన అనలాగ్ అండ్ డిజిటల్ ల్యాబ్ ఈ సరికొత్త సిగ్నలింగ్ వ్యవస్థను రూపొందించింది.

స్టాప్ లైన్ సిగ్నల్ ప్రధాన సిగ్నల్స్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. స్తంభంపై ఏ సిగ్నల్ పడితే.. కింద రోడ్డు మీద అమర్చిన ఎల్ఈడీ లైట్లు కూడా వెలుగుతాయి.

ఈ టెక్నాలజీ వల్ల పాదాచారులకు ఎంతో మేలు కలుగుతుంది. చాలామంది వాహనదారులు సిగ్నల్ పడినప్పుడు జీబ్రా క్రాసింగ్ వద్దే తమ వాహనాలను అమర్చుతుంటారు. దాని వల్ల రోడ్డు దాటే వాళ్లకు సమస్యలేర్పడేవి. ఈ సిగ్నల్స్ వల్ల జీబ్రా క్రాసింగ్ కు ముందే లైట్లు వెలుగుతాయి. వాహనదారులు క్రాసింగ్ కు ముందే వాహనాలను నిలుపుతారు. దీని వల్ల వాహనదారులు క్రాసింగ్ నుంచి నడుచుకుంటూ వెళ్లొచ్చు. దీని వల్ల ప్రమాదాలను ఆపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version