సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాశారు. కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీల మీద సీఎం జగన్ ఫొటోను తొలగించాలని ఆదేశించారు. అభ్యర్ధులకు తహసీల్దార్లు జారీ చేసే కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీలపై సీఎం జగన్ ఫొటో ఉండడం ఎన్నికల నియామవళికి విరుద్దమని పేర్కొన్న ఎస్ఈసీ వెంటనే ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఎస్ కు ఎస్ఈసీ సూచనలు చేసింది.
కుల ధృవీకరణ పత్రాలు, ఎన్వోసీల జారీలో వివక్ష, జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. నిజానికి గతంలో ఇలా ఉండేవి కాదు. కానీ జగన్ సిఎం అయ్యాక జనన, కుల, మరణ ధృవీకరణ పత్రాల మీద నవ్వుతున్న జగన్ పిక్ ఒకటి పెడుతున్నారు. నిజానికి గతంలోనే ఈ అంశం విమర్శల పాలు అయింది. అయితే ఇప్పుడు ఎన్నికల అంశాలనికి సంబందించింది కావడంతో ప్రభుత్వం ఖచ్చితంగా ఫాలో కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.