ఉద్యోగులకు కేంద్రం తీపికబురు…!

-

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా…? లేదా రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఉద్యోగులకు మోదీ సర్కార్ అదిరిపోయే తీపికబురు అందించేందుకు రెడీ అవుతోంది. పెండింగ్ ‌లో ఉన్నఆ మూడు డీఏలను ఒకేసారి అందిస్తామని ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి వివరాలని ఇప్పుడే చూసేద్దాం.

పూర్తి వివరాల లోకి వెళితే… ఉద్యోగులకు, పెన్షనర్లకు 2021 జూలై 1 నుంచి పెండింగ్‌ లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ DA ఇస్తున్నట్టు కేంద్ర వెల్లడించింది. దీనితో వాళ్ళకి కాస్త ఊరట కలుగుతుంది. ఈ విషయాన్నీ ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్య సభ లో చెప్పడం జరిగింది.

కోవిడ్ 19 కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంపును, పెన్షనర్లకు డీఆర్‌ పెంపును నిలిపేసిన సంగతి అందరికి తెలుసు. ఉద్యోగులను 1.1.2020, 1.7.2020, 1.1.2021 నుంచి 3 డీఏ ఇస్టాల్‌మెంట్లు పెండింగ్‌ లో ఉన్నాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో 50 లక్షల మంది ఉద్యోగులకు,ప్రభుత్వ తాజా నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 60 లక్షల మంది పెన్షనర్లకు రిలీఫ్ గా వుంది. ఇప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 17 శాతంగా లభిస్తోంది. డీఏ పెంపు అమలులోకి వస్తే ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. దీనితో లాభం కూడా ఉంటుంది. అలానే పెన్షనర్లు కూడా ప్రయోజనం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news