రూ.1800 కోట్లు ఇలా సంపాదించండి…!

-

పద్ధతి ప్రకారం ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ చెప్పినట్లు క్రమశిక్షణగా మదుపు చేస్తే కోటీశ్వరుడు కావడం అనేది పెద్ద కష్టం కాదని అంటున్నారు పరిశీలకులు. నెలకు రూ.1800 మదుపుచేస్తే కచ్చితంగా కోటీశ్వరుడు అయ్యేందుకు సుమారు 30 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. నిజానికి రూ. 1800 మదుపు చేస్తే 30 సంవత్సరాల్లో అది రూ.6,39,230 మాత్రమే అవుతుంది కాబట్టి, రూ.1 కోటి ఎలా అవుతుందని అని అంటారు.

డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే ఇండెక్స్(సెన్సెక్స్, నిఫ్టీ)లో పెట్టుబడి కన్నా అధిక రాబడిని ఇస్తాయని అంటున్నారు. కాబట్టి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకొని మదుపు చేస్తే లాభం వస్తుందని సూచిస్తున్నారు. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో క్రమబద్ధంగా ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మీ దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను సాకారం చేసుకోవచ్చని అంటున్నారు.

ప్రతి రెండేళ్లకొకసారి మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఫండ్స్‌ పనితీరును మదింపు చేయడం అనేది తప్పనిసరి. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోల్చితే మీరు ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ ఫండ్స్‌ పనితీరు గనుక ఆశించిన స్థాయిలో లేకపోతే, ఆ ఫండ్స్‌ నుంచి తప్పుకోవడ౦ బెస్ట్ అంటున్నారు. ఈక్విటీ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మాత్రం, దీర్ఘ కాలిక లక్ష్యాలను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news