కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి మంచి సౌకర్యాన్ని ఇచ్చింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సేవల విషయాలను క్రమబద్ధీకరించడానికినోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ వ్యవస్థ మినహా పాత పెన్షన్ పథకం ఓపిఎస్ ను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తోంది. ఈ ప్రయోజనాన్ని మే 31 వరకు పొందొచ్చు. అర్హత ఉన్న ఉద్యోగులు మే 5, 2021 లో గా అప్లై చేసుకోవాలి.
అసలు విషయం ఏమిటి..?
నిపుణులు చెప్పిన దాని ప్రకారం పాత పెన్షన్ స్కీం వల్ల చాలా ప్రయోజనం ఉంది. కొత్త దానితో పోలిస్తే పాత స్కీం వల్ల మంచి లాభాలు ఉంటాయి. ఆ స్కీం వల్ల పెన్షనర్ మరియు వాళ్ళ కుటుంబం కూడా సురక్షితంగా ఉంటుంది.
ఎవరు దీని వల్ల బెనిఫిట్ పొందుతారు..?
జనవరి 1, 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు మరియు 28 అక్టోబర్ 2009 కి ముందు కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు పాత పెన్షన్ సిస్టమ్ ని పొందగలరు. అయితే ఇలా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా పాత స్కీం ప్రయోజనాలు పొందవచ్చు. అలానే గతంలో ఓపియస్ ఎంపిక చేసుకునే వాళ్ళకి కూడా ఈ అవకాశం లభిస్తుంది.
ప్రభుత్వం ఏమంటోంది.?
ఇకపై పెన్షన్ పథకం కింద అన్ని కార్యకలాపాలు – రిజిస్ట్రేషన్, కంట్రిబ్యూషన్, ఇన్వెస్ట్మెంట్, ఫండ్ మేనేజ్మెంట్, ఉపసంహరణ, మెచ్యూరిటీ మొదలైనవి పిఎఫ్ఆర్డిఎ చట్టం, 2013 ప్రకారం నిర్వహించబడతాయి. అయినప్పటికీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సేవలకు సంబంధించిన అనేక కేసులు ఉన్నాయి.
అందువల్ల ఎన్పీఎస్ అమలును క్రమబద్ధీకరించడానికి ప్రత్యేక సేవా మాన్యువల్ ని రూపొందించి ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చారు. నోటిఫికేషన్ లో క్లుప్తంగా గైడ్లైన్స్ వివరించారు డిపాజిట్ పాయింట్ నుంచి రిజిస్ట్రేషన్ ఇలా అనేక విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే జాతీయ పెన్షన్ పథకం కింద ఉన్న అన్ని కేంద్ర ఉద్యోగులకు 26.08.2016 నాటి DOPPW ఆఫీస్ మెమోరాండం ప్రకారం సిసిఎస్ (పెన్షన్) నిబంధనల ప్రకారం వర్తించే నిబంధనల ప్రకారం పదవీ విరమణ గ్రాట్యుటీ మరియు డెత్ గ్రాట్యుటీ ప్రయోజనాలు కూడా ఇవ్వబడ్డాయి.