ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే..! అధికారిక వెబ్సైట్ https://nhai.gov.in/ లో చూడొచ్చు.
దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్లో ఇచ్చిన ఎడ్రస్ కి పంపాలి. దీనిలో మొత్తం 41 ఖాళీలు ఉండగా..మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 24, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 12, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6. బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సర్టిఫైడ్ మేనేజ్మెంట అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి.
GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075. ఈ ఎడ్రెస్ కి పంపాలి.