పోస్టాఫీస్ లో ఇక నుండి పాస్‌పోర్ట్..!

-

మీరు మీ యొక్క పాస్‌పోర్ట్ ని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక నుండి మీరు మీ పాస్‌పోర్ట్ గురించి ఎక్కడకి వెళ్ళక్కర్లేదు. ఈజీగా మీకు సమీపం లో వుండే పోస్టాఫీస్‌కు వెళ్లి పాస్‌పోర్ట్ ని పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

పాస్‌పోర్ట్ ని తీసుకోవాలని అనుకుంటే ఈజీగా మీరు ఇక నుండి పోస్టాఫీస్‌కు వెళ్లి పాస్‌పోర్ట్ ని పొందొచ్చు. దీంతో కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది అనే చెప్పాలి. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఇండియా పోస్ట్ తెలిపింది. పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్ అప్లికేషన్ వంటి సర్వీసులు దేశ వ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయి అని వెల్లడించింది.

దీని కోసం మీరు పోస్టాఫీస్ కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పాస్‌పోర్ట్ సేవలు పొందొచ్చు. పాస్‌పోర్ట్ ఒక కీలక డాక్యుమెంట్. ఇది ఐడెంటిటీ ప్రూఫ్‌గానే కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్‌కు కచ్చితంగా కావాలి.

విదేశాలకు వెళ్లిన వారు పాస్‌పోర్ట్ కలిగి ఉంటే ఇండియన్ సిటిజన్‌గా గుర్తింపు లభిస్తుంది
passportindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈజీగా పాస్పోర్ట్ కావాలని అనుకునే వాళ్ళు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news