పోస్టాఫీస్: వాటే స్కీమ్.. రూ.100 పొదుపుతో చేతికి రూ.10 లక్షలు..!

-

పోస్టాఫీస్ ( Post Office ): తక్కువ డబ్బులతో మంచి రాబడి పొందాలని మీరు అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇలా చేస్తే తక్కువ మొత్తంతో అదిరిపోయే రాబడి తప్పకుండ పొందొచ్చు. మరి ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

post office | పోస్టాఫీస్
post office | పోస్టాఫీస్

దీనిలో మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో పోస్టాఫీస్ కూడా ఒకటని గుర్తుపెట్టుకోవాలి. పోస్టాఫీస్ లో డబ్బులు పెట్టడం వలన మంచి రాబడి ఉంటుంది. పైగా ఏ రిస్క్ ఉండదు. ఇక స్కీమ్ కి సంబంధించి వివరాల లోకి వెళితే..

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF స్కీమ్ కూడా ఒకటి. ఎలాంటి రిస్క్ ఉండదు. పక్కా రాబడి వస్తుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో చేరితే రోజుకు రూ.100 పొదుపుతో ఏకంగా రూ.10 లక్షలు పొందొచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మెచ్యూరిటీ కాల 15 ఏళ్లు. మీరు రోజుకు రూ.100 ఆదా చేసి నెల చివరి లో రూ.3 వేలు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తే స్కీమ్ మెచ్యూరిటీ సమయంలో మీకు దాదాపు రూ.10 లక్షలు వస్తాయి.

దీని వలన పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అలానే వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తూ వస్తుంది. పీపీఎఫ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news