ఉద్యోగులు ఇక త‌మ డేటాఫ్ ఎగ్జిట్‌ను పీఎఫ్ సైట్‌లో అప్‌డేట్ చేసుకోవ‌చ్చు.. ఇలా చేయాలి..!

Join Our Community
follow manalokam on social media

ఉద్యోగులు ఏదైనా సంస్థ‌లో ప‌నిచేస్తూ జాబ్ మానేస్తే వారు త‌మ ఈపీఎఎఫ్‌వో రికార్డుల్లో ఆ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకోవాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీలే చేసేవి. అయితే ఈపీఎఫ్‌వో దీన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసింది. ఇక‌పై ఉద్యోగులు ఎవ‌రైనా స‌రే తాము ప‌నిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం మానేస్తే ఉద్యోగం మానేసిన తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్‌)ని తామే ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఈపీఎఫ్‌వో ఈ స‌దుపాయాన్ని తాజాగా అందిస్తోంది. ఇందుకు గాను ఉద్యోగులు కింద తెలిపిన స్టెప్స్‌ను అనుస‌రించాలి.

now employees can update their date of exit in epfo

1. ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in ను ఓపెన్ చేయాలి.

2. అందులో UAN, పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.

3. మేనేజ్ అనే విభాగంలోకి వెళ్లి మార్క్ ఎగ్జిట్ అనే ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. త‌రువాత డ్రాప్ డౌన్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ ను ఎంచుకుని అక్క‌డ పీఎఫ్ అకౌంట్ నంబ‌ర్‌ను సెలెక్ట్ చేయాలి.

4. డేట్ ఆఫ్ ఎగ్జిట్‌, రీజ‌న్ ఆఫ్ ఎగ్జిట్‌లను ఎంట‌ర్ చేయాలి.

5. రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేస్తే ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.

6. చెక్ బాక్స్‌ను సెలెక్ట్ చేయాలి.

7. అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి.

8. ఓకేపై క్లిక్ చేయాలి.

దీంతో ఉద్యోగుల‌కు చెందిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివ‌రాలు అప్‌డేట్ అవుతాయి. పీఎఫ్‌ను వేగంగా పొందేందుకు ఈ సౌక‌ర్యం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...