ఇక ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఫైలింగ్‌ మరింత ఈజీ!

-

పన్ను చెల్లింపుదారులకు ఇది శుభవార్త. అలాగే అందరికీ ఈ ఫైలింగ్‌ సులభతరం చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ చర్యలు చేపట్టింది. ఐటీ విభాగం కొత్త ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ను త్వరలో ప్రారంభించనుంది. జూన్‌ 7న ఈ నూతన ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ అందుబాటులోకి వస్తుందని ఐటీ శాఖ వెల్లడించింది. అలాగే, ప్రస్తుత పోర్టల్ను జూన్‌ 1 – 6 వరకు ఆరు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రానున్న కొత్త ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌https//incomtax.gov.in ఇది పన్ను చెల్లింపుదారులకు, ఐటీ శాఖ అధికారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని ఐటీ శాఖ తెలిపింది.

  • పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయడానికి, త్వరగా రీఫండ్‌ పొందడానికి ఈ పోర్టల్‌ సాయపడుతుంది.
  • ట్యాక్స్‌ పేయర్స్‌ అప్‌లోడ్‌ లేదా పెండింగ్‌ పనులను ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో చూసుకోవచ్చు.
  • ట్యాక్స్‌ చెల్లింపుదారుడికి ఎటువంటి టాక్స్‌ ఫైలింగ్‌ అవగాహన లేకపోయినప్పటికీ, సులభంగా పూర్తి చేసేలా దీన్ని రూపొందించారు.
  • పన్ను చెల్లింపుదారుడి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు కొత్త కాల్‌ సెంటర్ను ఏర్పాటు చేసింది.
  • ఈ–ఫైలింగ్‌ ఫీచర్‌ కేవలం డెస్క్‌టాప్‌లోనే కాదు మొబైల్‌ యాప్లోనూ అందుబాటులో ఉంటుంది.
  • ఈ–ఫైలింగ్‌ ఫీజు చెల్లింపు కోసం నెట్‌ బ్యాంకింగ్,యూపీఐ, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌‡ పేమెంట్‌ మోడ్‌లను ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుమని పన్ను చెల్లింపుదారుల నుంచి ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అందుకే, పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు పాత పోర్టల్‌ స్థానంలో కొత్త పోర్టల్ను రూపొందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version