ప్రైవేట్ ఉద్యోగులకి పీఎఫ్ డబ్బును పెంచుకోవడానికి అవకాశం..!

-

ప్రైవేట్ రంగం లో మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే మీకు ఇది మంచి వార్త. మీ భవిష్యత్తులో డబ్బును భద్రతపరచడానికి అదనపు జీతాన్ని ఇపిఎప్ కు ట్రాన్స్ ఫర్ చెయ్యచ్చు. మీరు మీ జీతం లో కొంత మొత్తాన్ని ఇపిఎఫ్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పదవి విరమణ తర్వాత ఒకేసారి ఈ అమౌంట్ వడ్డీతో సహా తీసుకోవచ్చు.

 

EPFO
EPFO

మీ epf ఖాతాకు pf సహకారాన్ని పెంచవచ్చు. ఏప్రిల్ నెల నుంచి ఇపిఎఫ్ డబ్బును మరింత రెట్టింపు చేసుకోవచ్చు. మీకు వచ్చే జీతం తగ్గినా కానీ పొదుపు, పన్నుల పరంగా ఇది మంచి ఆప్షన్. కనుక దీనిని మీరు వినియోగించుకోవడం మంచిది. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాక, పన్నులలో కూడా మీకు ప్రయోజనం ఇస్తుంది.

ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ 8.55 శాతం వడ్డీని అందిస్తుంది. ఉద్యోగులు వారి నెలవారీ సహకారాన్ని 100% ప్రాథమిక వేతనానికి పెంచవచ్చు. ఖాతా నుంచి నేరుగా డబ్బును జమ చేయవచ్చు. ఇలా వారు తమ పిఎఫ్ ఖాతాలో జమ చేయడం ద్వారా పన్నుల తో సహా మరిన్ని ప్రయోజానాలను ఉంటాయి. పైగా మీకు వడ్డీ కూడా ఎక్కువే వస్తుంది.

అయితే ఈ వడ్డీని ఎలా లెక్కిస్తారు అనే విషయానికి వస్తే.. ప్రతి నెల EPF ఖాతాలో జమ చేసిన మొత్తం ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు. సంవత్సరం చివరిలో ఖాతాకు జమ అవుతుంది. EPFO ఎల్లప్పుడూ ఖాతా ప్రారంభ, ముగింపు బ్యాలెన్స్ తీసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి లో వడ్డీ లెక్కించబడుతుంది. ప్రతి నెల చివరి రోజున బ్యాలెన్స్ యాడ్ చేసి, వడ్డీ మొత్తాన్ని నిర్ణీత వడ్డీ రేటు కంటే 1200 రెట్లు గుణించడం ద్వారా లెక్కించబడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news