ఎల్‌పీజీ కొత్త సిలిండర్లు.. తక్కువ బరువుతో అస్తెటిక్ లుక్..!

-

మీ ఇంట్లో ఇప్పటివరకు ఎల్‌పీజీకి చెందిన ఎరుపు, నీలం రంగు సిలిండర్లనే చూసి ఉంటారు. ఈ సిలిండర్లు ఐరన్‌తో తయారు చేసినవి. అలాగే అధిక బరువును కలిగి ఉంటాయి. సిలిండర్‌ను లేపడానికి చాలా కష్టాలు పడాలి. కానీ, ఇప్పుడు మీ సమస్యలు తీరబోతున్నాయి. ఎందుకంటే భారీ బరువుతో కూడిన సిలిండర్ల స్థానంలో కొత్త సిలిండర్లు వచ్చేస్తున్నాయి. ఈ సిలిండర్లు ఖాళీ అయినా ఈజీగా తెలుసుకోవచ్చు.

ఎల్‌పీజీ
ఎల్‌పీజీ

ఇండియన్ ఆయిల్ సంస్థ మరింత పారదర్శకతను కలిగిన సిలిండర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త శకానికి కొత్త సిలిండర్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణతో, అస్తెటిక్ లుక్‌తో పరిచయం చేస్తున్నారు. ఈ సిలిండర్లలో ప్రత్యేకతలేమిటో.. ఇతర సిలిండర్లకు వీటికి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. ఇండియన్ ఆయిల్ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కాంపోజిట్ ఎల్‌పీజీ సిలిండర్లను అందిస్తోంది. ఇవి ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీల్లో అందుబాటులో ఉంచింది. ఈ సిలిండర్లు కావాలని అనుకునే వారు సమీప సిలిండర్ విక్రేత డీలర్‌తో మాట్లాడి.. రిజిస్టర్ చేసుకోవాలి. ఇవి ఇనుప సిలిండర్ లాంటిది కాదని, చూడటానికి స్టైలిష్‌గా, చాలా భిన్నంగా కనిపిస్తాయన్నారు. ఈ సిలిండర్‌ను పట్టుకోవడానికి హ్యాండిల్‌ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశామన్నారు.

సిలిండర్ ప్రత్యేకతలు..
ఈ కొత్త సిలిండర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చు. మునుపటి సిలిండర్ల కంటే ఇది 50 శాతం తక్కువ బరువును కలిగి ఉంటాయి. అలాగే ఇందులో రెండు రకాల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. 5 కిలోలు, 10 కిలోల బరువు కలిగిన సిలిండర్లు ఉన్నాయి. ఈ సిలిండర్లు తప్పు కూడా పట్టవు. ఇంట్లో ఉండే స్పెస్‌కి అనుగుణంగా సిలిండర్లను వాడుకోవచ్చు. నచ్చిన సైజుల్లో సిలిండర్లను తీసుకోవచ్చు. ఈ సిలిండర్లు చూడటానికే కాదు.. భద్రత, రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా తయారు చేశామని ఇండియన్ ఆయిల్ సంస్థ వెల్లడించింది. ఈ సిలిండర్ లుక్‌తో మీ వంట గదికే అందమొస్తుందన్నారు. లేట్ చేయకుండా సమీప ఎల్‌పీజీ సిలిండర్ విక్రయదారుడిని సంప్రదించాలని ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news