ఇలా చేస్తే పది నిమిషాల్లోనే పాన్ కార్డు…!

ఇది వరకు అయితే పాన్ కార్డు పొందడం కష్టం అయ్యిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో ఈజీగా పాన్ కార్డు పొందొచ్చు. అది కూడా ఇంటి నుండి కదలక్కర్లేదు. జస్ట్ పది నిమిషాల్లోనే కార్డుని పొందొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. గతం లో అయితే పాన్ కార్డు కోసం ఎన్ని రోజులైనా వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈజీగా పాన్ కార్డుని పొందొచ్చు. అయితే పాన్ పొందాలంటే పక్కా ఆధార్ కార్డు ఉండాలి.

పాన్ కార్డు కావాలంటే ముందుగా https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్సైట్ కి వెళ్లాలి.
ఇప్పుడు మీరు “Instant PAN through Aadhaar” పై క్లిక్ చేయాలి. ఇది ఎడుమ వైపు ఉంటుంది చూడండి.
ఇప్పుడు ఒక కొత్తే పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీరు “Get New PAN” అప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ వస్తుంది.
నెక్స్ట్ మీరు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
OTP కోసం కాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి.
మీ రిజిష్టర్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసిన తరువాత , మీరు పాన్ కార్డ్ అప్లికేషన్ కోసం ఇ-మెయిల్ ఐడిని ధృవీకరించాలి.
కేవలం 10 నిమిషాల్లో మీ పాన్ నంబర్‌ ను పొందుతారు దీనిని మీరు PDF ఫార్మాట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీ కావాలంటే, దాని కోసం మీరు 50 రూపాయలు చెల్లించాలి.