ఏయే దేశాల్లో పెట్రోల్ ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?

-

భారతదేశంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఈరోజు పెట్రోల్ రేటు ఎంత.. ఈరోజు డీజిల్ రేట్ ఎంత. అన్న కాస్త ఆ పేపర్ ఇస్తావా? ఓసారి పెట్రోల్ ధరలు చూసి ఇస్తా.. ఇంటర్నెట్‌లోనూ రోజు లేవగానే ఈరోజు పెట్రోల్ ధరలు అంటూ సెర్చ్ చేసేవాళ్లు కోకొల్లలు. సెంచరీ దిశగా పెట్రోల్, డీజిల్ ధరలు పయనిస్తున్నవేళ అసలు ప్రపంచంలోని మిగితా దేశాల్లో పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కాస్త ఇంట్రెస్టింగే కదా. అందుకే పదండి అలా ఓసారి ప్రపంచాన్ని చుట్టొద్దాం.

వెనుజులా దేశం తెలుసు కదా మీకు. అక్కడ పెట్రోల్ ధర ఎంతో తెలుసా. లీటర్‌కు 0.63 రూపాయలు మాత్రమే. షాక్ అయ్యారా? అంతే మరి.. ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 20.89 రూపాయలు. సూడాన్‌లో 25.14 రూపాయలు, కువైట్‌లో 25.36 రూపాయలు, అల్గేరియాలో 25.98 రూపాయలు, బార్బడోస్‌లో మాత్రం లీటర్ పెట్రోల్ ధర రూ.143.29.. ఇక్కడ భారత్ కంటే ఎక్కువే. ఇది కరేబియన్ దీవి. నెదర్లాండ్స్‌లో కూడా ఎక్కువే.. రూ.142.11, నార్వేలో రూ.152.05, ఐస్‌లాండ్‌లో రూ.149.59, హాంకాంగ్‌లో రూ.160.38, పాకిస్థాన్‌లో రూ.55.19. చూశారుగా.. పెట్రోల్ పరంగా చూస్తే.. ధర తక్కువగా ఉన్న 167 దేశాల జాబితాలో ఇండియా 88వ ర్యాంకులో ఉంది.

గమనిక.. ఈ ధరలు ఆయా దేశాల కరెన్సీని భారతీయ కరెన్సీలోకి మార్చి ఇచ్చినవి. ఈ ధరలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ ధరలను బట్టి ఇచ్చినవి. అవి ఈరోజుకే పరిమితం. ధర కొంచెం అటూ ఇటూ ఉండొచ్చు. రేపటి ధరతో ఈ ధరలకు సంబంధం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news