ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో అదిరే లాభాలు..!

-

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. దీని వలన మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది డబ్బులు పొందాలని భావిస్తే కనుక ఇది బెస్ట్. అదే పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఈ స్కీమ్ వలన అదిరే లాభం పొందొచ్చు. అయితే మీరు ఎంచుకునే స్కీమ్ ప్రకారం మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా మారతాయి. పోస్టాఫీస్‌లో పలు రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే క్రమం తప్పకుండా డబ్బులు పొందొచ్చు.

దీని కోసం మీరు ముందుగానే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి. అయితే ప్రతి నెలా డబ్బులు మాత్రమే కాకుండా మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక ఎంత వరకు ఇన్వెస్ట్ చెయ్యచ్చు అనేది చూస్తే.. ఈ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ రూ.1000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మాక్సిమం రూ.4.5 లక్షల వరకు డబ్బులు పెట్టొచ్చు.

కావాలంటే ఈ స్కీమ్ లో ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు. అయితే రూ.9 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి అవుతుంది గమనించండి. ఇప్పుడు అయితే ఈ స్కీమ్ కింద 6.6 శాతం వడ్డీ వస్తోంది. రూ.50 వేలు ఒకేసారి డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాది రూ.3,300 పొందొచ్చు. ఐదేళ్లలో రూ.16,500 పొందొచ్చు.

ఒకవేళ కనుక దీనిలో మీరు రూ.లక్ష పెడితే మీకు ప్రతి నెలా రూ.550 అంటే ఏడాదికి రూ.6600 వస్తాయి. రూ.4.5 లక్షలు పెడితే నెలకు రూ.2500 వరకు వస్తాయి. ఇలా డబ్బుల్ని బట్టి మీరు లాభాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news