ఈ స్కీమ్ లో చేరితే పది లక్షల వరకు పొందొచ్చు…!

మంచి రాబడి పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీరు దీని కోసం తప్పక తెలుసుకోవాలి.
కేంద్ర సర్కార్‌ చాల రకాల స్కీములని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పథకాల్లో పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) స్కీమ్‌ కూడా ఒకటి. దీనిలో చేరారంటే మంచి రాబడి వస్తుంది.

పైగా ఏ ఇబ్బంది కూడా ఉండదు. పోస్టాఫీసుల్లో కూడా పీపీఎఫ్‌ స్కీమ్‌ అందుబాటులో ఉంది. ఇక దీనికి సంబందించి పూర్తి వివరాల లోకి వెళితే… పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకం మెచ్యూరిటీ కాలం వచ్చేసి 15 సంవత్సరాలు. అంటే మీరు 15 సంవత్సరాలు డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తూనే ఉండాలి.

మీరు నెలకు రూ.3వేలు పీపీఎఫ్‌లో పెడితే మెచ్యూరిటీ సమయం వరకు రూ.10 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌ చేసే డబ్బు రూ.5.4 లక్షలు అవుతుంది. మీకు రూ.4.4 లక్షలు అదనంగా వడ్డీ రూపంలో పొందవచ్చు.

ప్రస్తుతం పీపీఎఫ్‌ పథకంపై 7.1 శాతం వడ్డీ లభిస్తోంది. పైగా దీనిలో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీ, తీసుకునే డబ్బులపై పన్ను పడదు. ఈ స్కీమ్ ‌పై వడ్డీ రేట్లను మూడు నెలలకి ఒక సారి కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంది